- ఎన్టీఆర్ కి అసలు ఏమైంది? డాక్టర్లు ఏం చెప్పారు?
- ఎన్టీఆర్ కి డాక్టర్లు ఇచ్చిన సలహా ఏంటి?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆరోగ్యంగా తిరిగొచ్చారు. టాలీవుడ్ బాక్సాఫీస్ టెన్షన్ పక్కనపెడితే… ప్రస్తుతం అందరి దృష్టి ఎన్టీఆర్ హెల్త్ పైనే ఉంది. భుజానికి విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ పూర్తికావడంతో, సికింద్రాబాద్ KIMS ఆసుపత్రి నుంచి మన జూనియర్ ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్ల బృందం అందించిన అద్భుతమైన వైద్యంతో ఆయన పూర్తి ఆరోగ్యంతో బయటకు వచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో డాక్టర్లతో కలిసి దిగిన ఫోటోను KIMS యాజమాన్యం విడుదల చేయడంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇంటి వద్దే డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ కొనసాగనుంది.

కొద్దిరోజుల క్రితం భుజానికి గాయపడిన ఎన్టీఆర్.. వైద్యుల సూచన మేరకు కిమ్స్ ఆసుపత్రిలో చేరగా, ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఇంటివద్దే క్రమబద్ధమైన రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ ప్రక్రియను కొనసాగిస్తారని తెలిపారు. ఈ రికవరీకి దాదాపు 2 నుండి 3 నెలల సమయం పట్టవచ్చని, ఆ తర్వాత ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటారని వైద్యులు స్పష్టం చేశారు. ఇక, సర్జరీ విజయవంతమైన తర్వాత తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి, అభిమానులకు, కుటుంబ సభ్యులకు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ సినిమాల లైనప్‌పై అభిమానుల్లో ఎప్పుడూ ఉండే ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ తదుపరి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’ (Dragon) షూటింగ్‌కు సంబంధించి త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. తారక్ ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నప్పటికీ సినిమా షూటింగ్‌కు ఎలాంటి బ్రేక్ పడకుండా చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా తారక్‌తో సంబంధం లేని చిన్ననాటి సన్నివేశాలు, కొన్ని టాకీ పార్ట్ పోర్షన్‌లను దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో తెరకెక్కించనున్నారు. ఈ చిన్న షెడ్యూల్ పూర్తయిన తర్వాత, వైద్యుల సలహా మేరకు పూర్తి ఫిట్‌నెస్‌తో తారక్ కూడా త్వరలోనే ‘డ్రాగన్’ సెట్స్‌లో తిరిగి జాయిన్ కానున్నారు. మొత్తానికి తారక్ త్వరగా కోలుకుని, మరింత పవర్-ప్యాక్డ్ మాస్ లుక్‌తో మళ్లీ కెమెరా ముందుకు రాబోతుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.