- భారత ఎన్నికల వ్యవస్థ సూపర్-ట్రంప్
- USలో కూడా కఠినమైన ఓటర్ ఐడి-కావాలి-ట్రంప్
భారత ఎన్నికల వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన భారత ఎన్నికల విధానాన్ని ప్రశంసిస్తూ, ముఖ్యంగా ఓటర్ ఐడి వ్యవస్థను ఉదాహరణగా చూపించారు.
ట్రంప్ ఏమన్నారు?
అమెరికా లో తాజాగా జరిగిన ఒక ప్రసంగంలో ట్రంప్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ…భారతదేశంలో ఓటు వేయడానికి ప్రతి ఓటరికి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు వ్యవస్థ ఉందని చెప్పారు. అమెరికాలో కూడా కఠినమైన ఓటర్ ఐడి నిబంధనలు అవసరమని వాదించేందుకు భారత్‌ను ఉదాహరణగా ఉపయోగించారు. ఇందులో భాగంగానే సేవ్ అమెరికా యాక్ట్ ను తీసుకుని రావాల్సిన అవసరం ఉందన్నారు ట్రంప్.

ఇది ట్రంప్ కొత్తగా చెప్పిన విషయం మాత్రమే కాదు. 2025లో అమెరికా ఎన్నికల విధానంలో మార్పులకు సంబంధించిన తన చర్యల్లో కూడా భారత్‌ను ప్రస్తావించారు. భారతదేశం ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ వ్యవస్థలతో అనుసంధానించిన దేశాల్లో ఒకటిగా పేర్కొంటూ, అమెరికా ఎన్నికల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని చెప్పారు.

ట్రంప్ ప్రధానంగా నొక్కిచెప్పిన అంశాలు..ఏమిటి అంటే అమెరికాలో ఓటర్ ఐడి తప్పనిసరి కావాలి, ఓటు వేసేవారి పౌరసత్వ నిర్ధారణ కచ్చితంగా ఉండాలి, విస్తృత స్థాయి మెయిల్ -ఇన్ వోటింగ్ పై ఆంక్షలు ఉండాలని ఆయన అభిప్రాయం. ఈ విషయంలో భారత్ ఎన్నికల విధానం అమెరికాకు ఒక ఉదాహరణ అని ప్రస్తావించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఎన్నికల వ్యవస్థను కట్టుదిట్టం చేయడానికి భారతదేశంలోని ఓటర్ గుర్తింపు విధానాన్ని ట్రంప్ ఒక మంచి ఉదాహరణగా చూపించారు.
UPDATE: President trump revealed that India's chief election commissioner directly questioned the absolute absurdity of America's lack of voter ID requirements.
This international reality check exposes how the world’s largest democracy successfully manages nearly 650 million… pic.twitter.com/QkHMS6sPzN
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) August 18, 2026