- మెగాస్టార్ 158వ ఫిల్మ్ “”కాక””
- చిరు నెక్స్ట్ సినిమా పేరు “కాకా”గా ఖరారు
- భారీ అంచనాలను పెంచుతున్న గ్లిమ్స్
- గ్లిమ్స్ కు గ్యాంగ్ లీడర్ పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
- చిరంజీవి రెండు కోణాల్లో కనిపించే ఛాన్స్
- కథ నడుస్తుండగా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ !
- ఈ సినిమాతో గత రికార్డులన్నీ బద్దలు
- చిరు బర్త్ డే సందర్బంగా కొత్త ఫిలిం అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రానికి ‘కాకా’ (Mega 158) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఆగష్టు 22న టైటిల్ గ్లిమ్స్‌ను విడుదల చేసింది. ఈ సినిమా 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముఖ్య వివరాలు
నటీనటులు: చిరంజీవి, అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను.
దర్శకుడు: కొల్లి బాబీ (కేఎస్ రవీంద్ర)
సంగీతం: ఎస్.ఎస్. తమన్
విడుదల తేదీ: జనవరి 13, 2027 (సంక్రాంతి కానుకగా
ప్రొడక్షన్స్ : కేవీఎన్

ఆకట్టుకుంటున్న గ్లిమ్స్ లోని షాట్స్
ఈ గ్లిమ్స్ కు తన గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఒక ప్రముఖ పాటను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడారు. ఇప్పుడు ఆ మ్యూజిక్ ఫ్యాన్స్ కు ఉర్రూతలూగిస్తోంది. ఈ గ్లిమ్స్ లోని షాట్స్ సినిమా అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో ఆక్వా సంస్థలో పనిచేస్తున్న సత్యం పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు “”ఇది సత్యం మాట మీకేమైనా డౌటా” అనే డైలాగుతో పాటు మిగతా సంభాషణలు సినిమా అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ గ్లిమ్స్ లో ఒక కీ చైన్ స్పెషల్ గా కనిపిస్తోంది. దీని వెనుక ఏదో భారీ కథనే ఉండి ఉంటుందని అర్థమవుతోంది. దర్శకుడు కొల్లి బాబి చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. చిరుతో పాటు ఒక శునకం కూడ ఉంది. ఆ శునకం తో వచ్చే సన్నివేశాలు అందరిని కట్టిపడేస్తాని గ్లిమ్స్ సూస్తే తెలుస్తోంది.
చాలా యంగ్-వింటేజ్ లుక్స్ లో చిరంజీవి
ఈ సినిమాలో చిరంజీవి చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. అలాగే వింటేజ్ లుక్స్ ను కూడా తీసుకొచ్చారు దర్శకుడు బాబి. ఈ గ్లిమ్స్ ను చూస్తే చిరంజీవి ప్రస్తుతం-గతం అనే రెండు కోణాల్లో కనిపించనున్నట్టు అర్థం అవుతోంది. ఫస్ట్ ఆఫ్ సత్యం పాత్రలో కనిపిస్తూ…సందర్భం వచ్చినపుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్…ఆ ఫ్లాష్ బ్యాక్ లోనే “కాకా” పాత్రలో చిరంజీవి కనిపించే ఛాన్స్ ఉంది.
బాషాలో రజనీకాంత్ పాత్రను తలపించేలా..”కాకా”
అవును. ఈ సినీమా గ్లిమ్స్ ను చూస్తుంటే బాషా సినిమాలో రజినీకాంత్ పాత్రలు ఉన్నట్ట్టు ..రెండు పాత్రల్లో చిరు కనిపించే అవకాశం కనిస్తోంది. అయితే అంతకుమించి ఉండబోతోందని ఈ గ్లిమ్స్ ని చూస్తే తెలుస్తోంది “కాకా”.