- టాలీవుడ్ మాస్ కమ్‌బ్యాక్!
వెండితెరపై కొద్దికాలంగా అలముకున్న నిశ్శబ్దానికి, బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాల పరంపరకు ఒక్కసారిగా తెరపడింది. టాలీవుడ్ ఇప్పుడు కేవలం సినిమాల జోరు మీదే కాదు.. ఓ సునామీ లాంటి ‘కమ్‌బ్యాక్ సీజన్’ ను గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. గత రెండు నెలలుగా బాక్సాఫీస్ రిపోర్ట్స్ చూస్తుంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీకి అసలైన దశ దిశ మారిందనే చెప్పాలి. సక్సెస్ రేట్ గ్రాఫ్ అకస్మాత్తుగా స్కై హైకి చేరింది.

బాక్సాఫీస్ వద్ద పరాజయాల చలిగాలులు వీచి, ఇండస్ట్రీ డీలా పడిపోయిందనుకున్న ప్రతిసారీ.. తెలుగు సినిమా తన అసలు సిసలైన విశ్వరూపాన్ని చూపించింది. గడిచిన రెండు నెలల బాక్సాఫీస్ గ్రాఫ్ చూస్తుంటే అర్థమవుతోంది.. ఇది కేవలం విజయాల మోత కాదు, ఇండస్ట్రీ చరిత్రలో ఒక ‘మాస్ కమ్‌బ్యాక్ జాతర’. ఫ్లాపులతో సతమతమై, కిందపడిన ప్రతి స్టార్ హీరో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద అగ్గి రాజేస్తున్నారు!
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కొంతడల్లా ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్, గత రెండు నెలలుగా మాత్రం ఊపందుకుంది. పెద్ద హీరోలైనా, యంగ్ హీరోలైనా, లేడీ ఓరియంటెడ్ చిత్రాలైనా సరే.. కంటెంట్ ఉంటే ఆడియన్స్ నెత్తికెత్తుకుంటారని ఈ సీజన్ నిరూపించింది. వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న ప్రతి స్టార్ హీరో అభిమానికి, ఈ రెండు నెలల కలెక్షన్స్, సక్సెస్‌లు ఒక ఊరటనిచ్చాయి.
టాలీవుడ్ స్టార్ హీరోలకు ఈ ఏడాది మంచి బూస్టప్ ఇచ్చింది. సంక్రాంతిలో మన శివశంకర వరప్రసాద్‌తో సాలిడ్ హిట్ సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సమ్మర్ సీజన్‌లో చాలా సినిమాలు విడుదలైనా… సరైన హిట్స్ మాత్రం లేవు. కానీ గత మూడు నెలలుగా రిలీజ్ అవుతున్న సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అవ్వడంతో ఇండస్ట్రీలో సక్సెస్ రెట్ పేరుతోంది. ముఖ్యంగా పెద్ద హీరోలకు విజయాలు దక్కుతున్నాయి.
‘గేమ్ ఛేంజర్’ తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా సరే.. బాక్సాఫీస్ బరిలో దిగితే కింగ్ ఆఫ్ ది గేట్ తానే అని నిరూపించాడు రామ్ చరణ్. ‘పెద్ది’ సినిమాతో అతను కొట్టిన దెబ్బకు థియేటర్లలో రికార్డులు బద్దలయ్యాయి. కసి మీదున్న పులి వేట ఎలా ఉంటుందో బాక్సాఫీస్‌కు మరోసారి రుచి చూపించాడు మెగా పవర్ స్టార్! బాక్సాఫీస్ బద్దలుకొట్టే ఊరమాస్ హిట్ కొట్టాడు. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా సరైన హిట్ కోసం కసిగా ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేనికి ‘లెనిన్’ సినిమాతో తొలి క్లీన్ అండ్ పవర్‌ఫుల్ హిట్ పడి, అఖిల్ కెరీర్‌కు సరికొత్త ఊపిరి వచ్చింది. అఖిల్ అందుకున్న ‘లెనిన్’ సక్సెస్ సాధారణమైనది కాదు. ఈ విజయం అతని కెరీర్‌కు ఊపు ఇవ్వడమే కాదు, అక్కినేని కాంపౌండ్‌లో నూతన ఉత్సాహాన్ని నింపింది. వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్‌లోనూ ఎదురైన తుఫాన్లను లెక్కచేయకుండా.. తన సొంత నిర్మాణంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ తో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసింది సమంత. వరుస పరాజయాల ముద్రను చెరిపేస్తూ, లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే బాక్సాఫీస్‌ను ఎలా శాసించవచ్చో ఆమె మరోసారి నిరూపించింది. కెరీర్ పరంగా, పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఒడిదుడుకులను తట్టుకుంటూ సమంత తన సొంత నిర్మాణంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టి.. వరుస పరాజయాలకు చెక్ పెడుతూ ఘనమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.
ప్రయోగాలు వికటించి డీలా పడ్డ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా సరిగ్గా టైమ్‌కు ఆక్సిజన్ లా పనిచేసింది. బాక్సాఫీస్ వద్ద నవ్వుల జలపాతం పారిస్తూ, తనలోని కమెడియన్‌ను బయటకు తీసి సెన్సేషనల్ హిట్ కొట్టాడు. వరుణ్ తేజ్‌కు ‘కొరియన్ కనకరాజు’ సాలిడ్ కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్త లైఫ్ ఇచ్చింది. ఇక బాక్సాఫీస్ రారాజు మాస్ మహారాజా రవితేజ విషయానికొస్తే.. ఇప్పుడు ‘ఇరుముడి’ తో మరోసారి థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాడు. ప్రతి థియేటర్ హౌస్ పుల్ కలెక్షన్స్‌తో కలకలలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి థియేటర్ వద్ద మాస్ జాతర కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత టికెట్‌లు దొరకక హౌస్ పుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇరుముడితో తన కేరియర్‌లోని అత్యధిక కలెక్షన్లు సాధించాడు రవితేజ.

ఫ్లాపులతో కుదేలైన ప్రతి హీరో ఇప్పుడు బౌన్స్‌బ్యాక్ అయి ఫాంమ్‌లోకి రావడం చూస్తుంటే.. “ఇది కేవలం విజయాల మోత కాదు.. టాలీవుడ్ అసలు సిసలైన కమ్‌బ్యాక్ ఏరా!” అని విశ్లేషకులు అంటున్నారు. గత రెండు నెలల కాలం టాలీవుడ్‌కు ఒక సువర్ణావకాశం. ఏ హీరో ప్లాపుల్లో ఉన్నా, ఏ డైరెక్టర్ రేసులో లేకపోయినా.. కంటెంట్ ఉన్న ప్రతీ సినిమాను తెలుగు ప్రేక్షకులు నెత్తికెత్తుకున్నారు. సక్సెస్ రేట్ ఒక్కసారిగా స్కై టచ్ అయింది. ఇండస్ట్రీలో ఇప్పుడు నెగెటివిటీ కరిగిపోయింది, కేవలం ‘పాజిటివ్ వైబ్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్’ మాత్రమే వినిపిస్తున్నాయి. సినిమా బాగుంటే.. హీరో ఎవరైనా బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే అని ఈ సీజన్ మరోసారి రుజువు చేసింది! కంటెంట్ ఉంటే బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టేస్తాం అని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు.
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్,