పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్సులు చేస్తే చర్యలు తప్పవు!

  • లీడ్: పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్సులు చేస్తే చర్యలు తప్పవు!

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్సులు చేస్తూ.. ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బందికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయడం, ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొనడం వంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్సులు వేస్తున్నారా..? ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొంటున్నారా..? అయితే ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఎందుకంటే.. యూనిఫామ్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడే పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాల్లో పోలీసు సిబ్బంది యూనిఫామ్‌లో డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ వీడియోలపై తీవ్ర చర్చ జరగడంతో పాటు.. పోలీసు శాఖ క్రమశిక్షణ, ప్రతిష్ఠపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉండే యూనిఫామ్‌తో డ్యాన్సులు చేయడం, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

పోలీస్ యూనిఫామ్ అనేది కేవలం దుస్తులు మాత్రమే కాదని.. అది బాధ్యతకు, అధికారానికి, క్రమశిక్షణకు ప్రతీక అని డీజీపీ పేర్కొన్నారు. యూనిఫామ్ గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు.

ఇకపై ఈ ఆదేశాలను ఉల్లంఘించే సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తంగా.. పోలీసు యూనిఫామ్ గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా డీజీపీ సీవీ ఆనంద్ ఈ ఆదేశాలు జారీ చేశారు.

ట్రెండింగ్ న్యూస్