హైదరాబాద్ త్రికాల తెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,800కుపైగా రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అభ్యర్థులకు కనీసం 18–40 ఏళ్ల వయస్సుతో పాటు పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అర్హత ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.