- ఒమన్ తీరంలో దాడి..ట్యాంకర్లో మంటలు.
- ఇద్దరు భారతీయ నావికులు మిస్సింగ్ !
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు…ఒమన్ తీరంలో డ్రోన్ దాడితో ట్యాంకర్లో మంటలు చెలరేగాయి! ఈ ఘటనలో 9 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించగా, మరో ఇద్దరు ఆచూకీ గల్లంతవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది!
అసలేం జరిగింది?
ఒమన్లోని సోహార్ తీర ప్రాంతంలో లంగరు వేసి ఉన్న MT పెట్రో డాల్ఫిన్ అనే ట్యాంకర్పై అక్టోబర్ 11న డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ నౌకలో మొత్తం 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. దాడి అనంతరం తొమ్మిది మందిని సురక్షితంగా రక్షించారు. అయితే మరో ఇద్దరు భారతీయ నావికులు గల్లంతైనట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.
గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు!
గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం స్థానిక కోస్ట్గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం కూడా అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు భద్రత కల్పించాలని, ఉద్రిక్తతలను తగ్గించి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.
ప్రస్తుతం అందరి దృష్టి గల్లంతైన ఇద్దరు భారతీయ నావికుల ఆచూకీపైనే ఉంది. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Drone Attack on Tanker MT PETRO DOLPHIN at Sohar Anchorage, Oman; Two Indian Seafarers Missing
A total of 12 crew members, including 11 Indians, were on board; 10 were rescued safely, while the Coast Guard is searching for the missing seafarers.
Oman/New Delhi, October 11,… pic.twitter.com/N4eyFq46yd
— Marine Tanks (Voice of Sea) (@MarineTanksInd) October 11, 2026