- రోజుకో ఎమ్మెల్యే.. కొత్త వివాదం!
- కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్న ఎమ్మెల్యేలు
- సీఎం రేవంత్ రెడ్డి నియంత్రణ లోపిస్తోందా?
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల ‘రచ్చ రంబోలా’
- ఒకాయన టీవీ ఆఫీస్ ముందు బైఠాయింపు
- ఇంకొకాయన బస్సులో వివాదం!
- పార్టీ అన్న భయం లేదు.. సీఎం అన్న లెక్కే లేదు
- సీఎం రేవంత్కు లీడర్లంటే పట్టు తప్పిందా?
ఒకాయన టీవీ ఆఫీస్ ముందు బైఠాయింపు.. ఇంకొకాయన బస్సులో వివాదం! నిత్యం ఏదో ఒక రచ్చతో కాంగ్రెస్ పరువు తీస్తున్న కొందరు ఎమ్మెల్యేలు. సొంత పార్టీ నేతలను అదుపులో పెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమవుతున్నారా? అసలు లీడర్లకు అధిష్ఠానం అంటే లెక్కే లేదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యల కంటే కొందరు ఎమ్మెల్యేల తీరు, వారు చిక్కుకుంటున్న వివాదాలే తరచూ వార్తా పతాకాల్లో నిలుస్తున్నాయి. నియోజకవర్గాల్లో అభివృద్ధి, పాలనపై దృష్టి పెట్టాల్సిన ప్రజాప్రతినిధులు అనుచిత ప్రవర్తన, బహిరంగ రచ్చలతో పార్టీ ప్రతిష్టను తామే దిగజార్చుకుంటున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి.ఇటీవల మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ ముందు కూర్చుని నానా హంగామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చట్టపరమైన మార్గాలు ఎంచుకోవాల్సింది పోయి, రోడ్డుపై పడి రచ్చ చేయడం పార్టీ శ్రేణులను సైతం ఇరకాటంలోకి నెట్టింది.

మరోవైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ పాఠశాల విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ వచ్చిన ఆరోపణలు, సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.ఇవి కేవలం ఒకటీ రెండు ఘటనలకే పరిమితం కాలేదు. గడిచిన కొద్ది నెలలుగా గమనిస్తే.. అధికారులను బహిరంగంగా బెదిరించడం, కార్యాలయాల్లో వాగ్వాదాలకు దిగడంభూ వివాదాలు, సెటిల్మెంట్లలో పార్టీ నేతల పేర్లు వినిపించడంసొంత పార్టీ మంత్రులు, సీనియర్లపైనే అసంతృప్తి వెళ్లగక్కుతూ బహిరంగ విమర్శలు చేయడంవంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ పరిణామాలు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమపై నేరుగా వేలెత్తి చూపుతున్నాయి.

ఒకవైపు పాలనపై పట్టు సాధించేందుకు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేస్తోంది. ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్ఠానం అన్నా, సీఎం అన్నా లెక్క లేకుండా పోయిందన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుంటోంది. వివాదాల్లో చిక్కుకున్న వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం, హెచ్చరికలు కేవలం అంతర్గత సమావేశాలకే పరిమితం కావడం వల్లే ప్రజాప్రతినిధులు బరితెగిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలను అదుపులో పెట్టడంలో సీఎం రేవంత్ విఫలమవుతున్నారా అన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు ఆజ్యం పోస్తున్నాయి.
ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాల్సిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివాదాల్లో మునిగితేలుతున్నారు. అధికారులపై దాడులు, బహిరంగ రచ్చలు, అనుచిత ప్రవర్తనలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నారు. తప్పులు చేసిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే బరితెగిస్తున్నారా? సొంత ఎమ్మెల్యేలపై పట్టు కోల్పోతున్న రేవంత్ సర్కార్ తీరుపై ప్రజాక్షేత్రంలో మొదలైన అసంతృప్తి!
-జి.మహేష్ కుమార్✍️
సీనియర్ జర్నలిస్ట్
మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వీరంగం
తన మీద తప్పుడు వార్తలు ప్రచారం చేశారంటూ ఆర్టీవీ కార్యాలయం హంగామా సృష్టించిన మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఏమీ చేయలేక చోద్యం చూసిన పోలీసులు pic.twitter.com/p3AZiISqTl
— QNews (@QGroupMedia) October 7, 2026
This sorry excuse of a human being is Congress MLA Malreddy Ranga Reddy, from Ibrahimpatnam, Hyderabad.
Dear Girls,
Don’t hesitate to slap the hell out of disgusting lechers like these.
No one.
Absolutely no one can and should touch you like this without your permission.… pic.twitter.com/XFeOXM19oQ— Revathi (@revathitweets) October 6, 2026
𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐥𝐞𝐚𝐝𝐞𝐫𝐬 𝐬𝐡𝐨𝐮𝐥𝐝 𝐡𝐚𝐧𝐠 𝐭𝐡𝐞𝐢𝐫 𝐡𝐞𝐚𝐝𝐬 𝐢𝐧 𝐬𝐡𝐚𝐦𝐞.
Congress MLA Malreddy Ranga is holding a female student’s hand and touching her inappropriately.
Rahul Gandhi, who lectures the nation on “Smashing the Patriarchy”, should see the… pic.twitter.com/EUB187meGZ
— BJP (@BJP4India) October 8, 2026