ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుంటే..ఏమవుతుందో..తెలుసా ?

  • ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుంటే..ఏమవుతుందో..తెలుసా ?

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి కరీంనగర్ కు చెందిన వెంకటేష్ అనే విద్యార్థి పరిస్థితే ప్రత్యక్ష ఉదాహరణ. మూడేళ్ల ఫీజు కింద లక్షా ఐదు వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో, నాలుగేళ్ల కష్టం పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు అడ్డుకుంటున్నాయి. ఆ సర్టిఫికెట్లు లేక అటు ఉన్నత చదువులకు వెళ్లలేక, ఇటు చేతికొచ్చిన ఉద్యోగాల్లో చేరలేక వందలాది ఇంజనీరింగ్ కాలేజీల్లోని వేలాది మంది యువత రోడ్డున పడుతున్నారు. కొత్త బ్యాచ్ లు వస్తున్నా పాత బ్యాచ్ విద్యార్థులకు దిక్కులేని పరిస్థితి నెలకొంది.

చదువు విలువ తెలిసిన వారు విద్యాశాఖ మంత్రి అయితే ఆ బాధ అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి గారేమో మొన్నామధ్య హార్వర్డ్ వెళ్లి వారం రోజులు ఏదో కోర్సు చేసి వచ్చారు. కానీ ఆయనకి చెరువుకు, సముద్రానికి కనీస తేడా కూడా తెలియదు. రోజూ సెక్రటేరియట్ నుంచి హుస్సేన్ సాగర్ ను చూసి తెలంగాణకు కూడా సముద్రం ఉందని భ్రమపడుతున్నారు. ఇలాంటి పాలకుల చేతిలో మన రాష్ట్ర విద్యావ్యవస్థ ఉంటే యువత భవిష్యత్తు ఏమవుతుందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి, వారి సర్టిఫికెట్లు వాళ్లకు ఇప్పించే వరకు విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాడుతూనే ఉంటుంది.

-@raghu_verabelli, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు

ట్రెండింగ్ న్యూస్