సీఎం రేవంత్ రెడ్డి US పర్యటన రద్దులో..రాజకీయ కోణం లేదు: బీజేపీ ▶️

ముఖ్యమంత్రులు లేదా మంత్రుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ (MEA) నుండి నిబంధనల ప్రకారం క్లియరెన్స్ తీసుకోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే అని అన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు.  “”పర్యటన ఉద్దేశం, ఆహ్వానించిన సంస్థల వివరాలు, భద్రత, ప్రోటోకాల్, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఉంటాయి. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తరుణ్ గొగొయ్, బీజేపీ సీఎం అర్జున్ ముండా విదేశీ పర్యటనలకు అనుమతులు నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పర్యటన విషయంలో నిబంధనలు, లోపాలు ఉన్నందునే ప్రక్రియ ప్రకారం నిలిపివేశారు తప్ప, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు””. – రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు

ట్రెండింగ్ న్యూస్