- బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి ఉరిశిక్ష!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో కీలక తీర్పు వెలువడింది. భర్త సౌరభ్ రాజ్పుత్ను హత్య చేసిన కేసులో నిందితులు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కోర్టు మరణశిక్ష విధించింది.

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో.. 2025 మార్చిలో సౌరభ్ రాజ్పుత్ హత్యకు గురయ్యాడు. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి, సిమెంట్, ఇసుకతో నింపిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్లో దాచిపెట్టారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.కేసు విచారణలో భాగంగా 126 సార్లు కోర్టు విచారణ జరగగా.. ప్రాసిక్యూషన్ 22 మంది సాక్షులను విచారించింది. సెప్టెంబర్ 30న ముస్కాన్, సాహిల్లను దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. తాజాగా అక్టోబర్ 14న ఇద్దరికీ ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

హత్యతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసిన నేరాలకు సంబంధించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.అయితే, మరణశిక్ష అమలుకు సంబంధించి తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగాల్సి ఉంటుంది. మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో వెలువడిన ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.