- జేఎన్యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు మరోసారి తీవ్ర చర్చ
- కాంగ్రెస్ ఎంపీ, జేఎన్యూ మాజీ ప్రొఫెసర్ అంగోమ్చాపై ఎఫ్ఐఆర్
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ… జేఎన్యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ ఎంపీ, జేఎన్యూ మాజీ ప్రొఫెసర్ అంగోమ్చా బిమోల్ అకోయిజామ్ పేరును ప్రస్తావిస్తూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జేఎన్యూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా… అక్టోబర్ 11న వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహిళలపై లైంగిక వేధింపులు, మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలకు సంబంధించిన భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఇదే ఆరోపణలకు సంబంధించి జేఎన్యూ యాజమాన్యం అక్టోబర్ 9న బిమోల్ అకోయిజామ్ను ప్రొఫెసర్ పదవి నుంచి తొలగించింది. పలువురు విద్యార్థినులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో యూనివర్సిటీ అంతర్గత విచారణ చేపట్టినట్లు వార్తలు వెలువడ్డాయి.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను అకోయిజామ్ ఖండించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పందించాలని బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ డిమాండ్ చేశారు. మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించారు.
మొత్తానికి… జేఎన్యూలో వెలుగుచూసిన ఆరోపణలు, తాజాగా నమోదైన ఎఫ్ఐఆర్తో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Watch the full video: https://t.co/wszZ8mS9FN 9 October, the top Congress leadership, including Rahul Gandhi, Sonia Gandhi and Priyanka Gandhi, has maintained complete silence on the issue of Congress MP Bimol Akoijam’s sacking by JNU over sexual misconduct. If you remain… pic.twitter.com/7WpduIUMyA
— BJP4BengaluruSouth (@BJP4BlrSouth) October 11, 2026
Congress lectures the nation on women’s safety while its own ranks face serious questions over allegations of sexual exploitation. JNU sacked Professor and Congress MP Angomcha Bimol Akoijam over allegations of sexual exploitation of female students. RaGa, when your own party… pic.twitter.com/tx0zqN6Exp
— BJP4BengaluruSouth (@BJP4BlrSouth) October 10, 2026