జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.

  • జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది..మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు..మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు..

రాధాకృష్ణకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్..గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లో పనిచేసిన రాధాకృష్ణ.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొనసాగారు..తాజాగా జనసేనలో చేరడంతో విజయవాడ రాజకీయాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది..

ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో రాధాకృష్ణ పాత్ర ఎలా ఉండబోతోంది..? రాబోయే రోజుల్లో ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగించనున్నారు..? అనేది ఆసక్తికరంగా మారింది..

అయితే.. రాధాకృష్ణకు ఏదైనా ప్రత్యేక పదవి లేదా బాధ్యతలు కేటాయించినట్లు అధికారిక ప్రకటన ఉంటేనే స్పష్టత రానుంది..

ట్రెండింగ్ న్యూస్