హైదరాబాద్ త్రికాల తెలుగు:
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల బోనస్ అమలులో పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి 2026 వానాకాలం సీజన్ నుంచి అమల్లోకి రానున్నాయి. రైతులు విక్రయించిన సన్న వడ్ల వివరాలను తప్పనిసరిగా డీలర్ల వెబ్సైట్లో నమోదు చేయాలని, విక్రయించిన ధాన్యానికి సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాలని ఆదేశించింది. అక్రమాలను అరికట్టడం, అర్హులైన రైతులకు బోనస్ అందేలా చూడడమే ఈ మార్గదర్శకాల లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
బోనస్‌కు అర్హమైన సన్న వడ్ల రకాలు
అభినీత్ – 15048
బీపీటీ – 5204
కేఎన్ఎం – 1638
హెచ్ఎంటీ సోనా
జై శ్రీరామ్
డబ్ల్యూ జీఎల్ – 44
కేఎన్ఎం – 7715