హైదరాబాద్ త్రికాల తెలుగు: హైదరాబాద్ సిపీ సజ్జన్నార్, విద్యార్థుల, తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు.యూజీసీ లేదా సంబంధిత విశ్వవిద్యాలయాల అనుమతి లేకుండా కొన్ని ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలతో డిగ్రీ అడ్మిషన్లు చేపడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు కళాశాలలో చేరే ముందు UGC మరియు DOST వెబ్సైట్లలో గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని, అనుమానాస్పద సంస్థలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనుమతి లేని కళాశాలల్లో చేరితే డిగ్రీ, డబ్బు, సమయం వృథా అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.