గ్రేటర్
హైదరాబాద్ త్రికాల తెలుగు: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న రూ.5.02 కోట్ల విలువైన 833.118 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు శనివారం జూలై 4 2026న దహనం చేసి నిర్వీర్యం చేశారు. 101 ఎన్డీపీఎస్ కేసులకు సంబంధించిన గంజాయి, గంజాయి చాక్లెట్లు, ఎండీఎంఏ, హషీష్ ఆయిల్, అల్ప్రాజోలామ్, చరాస్ తదితర మాదకద్రవ్యాలను కోర్టు అనుమతితో పర్యావరణ నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.