హైదరాబాద్ త్రికాల తెలుగు: ఒక సంవత్సరం జీతాన్ని సత్యసాయి సంజీవని ఆసుపత్రి ట్రస్ట్‌కు విరాళంగా అందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్లో విజయవంతంగా 500 ఉచిత గుండె సర్జరీలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం జూలై 4 2026న ఏర్పాటు చేసిన ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్నరు మాజీ మంత్రి.
హరీష్ రావు మాట్లాడుతూ…””ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా శ్రీనివాస్ గారి గురించి నేను పొగడటానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒక్కటే చెబుతున్నాను. శ్రీనివాస్ గారు మనకు కనిపించే దేవుడు. దేవాలయంలో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ గారు ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్లలో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్లలో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది.
ప్రతి సంవత్సరం సుమారు ఆరు వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందిస్తూ వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం సాధారణ విషయం కాదు.ఇది శ్రీనివాస్ గారి అంకితభావానికి, సత్యసాయి బాబా ఆశీర్వాదాలకు నిదర్శనం. అందుకే నేను ఆయనను కనిపించే దేవుడు అని అంటాను. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సేవా కార్యక్రమాల కోసమే ఆయన తన సమయాన్ని వెచ్చిస్తున్నారు. Charity begins at home అనే మాటను ఆచరణలో చూపిస్తూ, ఎవరో విరాళం ఇస్తే సేవ చేయడం కాదు, తన సొంత సంపాదనను ఖర్చు చేస్తూ, ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ఈ ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తున్నారు.
ఈరోజు మనం చిన్నారుల, తల్లిదండ్రుల మాటలు విన్నాం. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన కుటుంబం మాట విన్నాం. ఒడిశా నుంచి వచ్చిన కుటుంబం అనుభవం విన్నాం. వారి కళ్లలో కనిపించిన ఆనందం, కృతజ్ఞత, నమ్మకం ఈ ఆసుపత్రి చేస్తున్న సేవలకు గొప్ప నిదర్శనం.ఇలాంటి మహోన్నత సేవను అందిస్తున్న శ్రీనివాస్ గారికి, వైద్యులకు, నర్సులకు, సిబ్బందికి మరోసారి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మనం ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చూస్తూ ఉంటాం. కానీ అంతే నీట్నెస్, అంతే కేర్, అంతే ప్రేమ, అంతే మంచి ట్రీట్మెంట్ నిజంగా అక్కడ అందిస్తున్నారు.
మన దగ్గర చికిత్స పొందిన ఒక తండ్రి మాట విన్నాం. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని పలాస నుంచి వచ్చిన వారి మాట విన్నాం. మన సిద్ధిపేటకు చెందిన చిన్నారి కూడా ఇక్క ఉన్నాడు. ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వైద్యం పొందడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.
ఇందులో మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఒక్కటే. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం కాదు. భగవంతుడు మనకు ఈ గొప్ప మానవ జన్మను ఇచ్చినందుకు, మనం కూడా మనకు తోచినంతగా తోటివారికి సహాయం చేయాలి, సహకారం అందించాలి. అలాంటి సేవాభావాన్ని ఈ ఆసుపత్రిని చూసి, ఇక్కడ జరుగుతున్న సేవలను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
నిజంగా నాకు కూడా ప్రతిసారి ఒక అనుభూతి కలుగుతుంది. ఇది నేను నాలుగోసారి ఈ ఆసుపత్రికి వచ్చి చిన్నారులను, వారి కుటుంబాలను కలుస్తున్నాను. ప్రతి సారి సర్జరీ పూర్తయి ఆరోగ్యంగా బయటకు వస్తున్న ఆ పిల్లలను చూసినప్పుడు నా గుండె ఉప్పొంగిపోతుంది. మనం చేసిన ఒక చిన్న ప్రయత్నం సమాజానికి ఉపయోగపడుతుంటే, అంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది?జీవితంలో మనం ఎంత పెద్ద పదవులు అలంకరించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది కాదు.
ఎంత పెద్ద పరిశ్రమలు స్థాపించాం, ఎంత ఆస్తి సంపాదించాం అనేది కాదు.
చివరికి శాశ్వతంగా నిలిచేది మనం చేసిన సేవ, మనం చేసిన మంచి పని మాత్రమే. వ్యక్తులు వస్తారు, వెళ్తారు. But work remains. మనం చేసిన మంచి పని ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అందుకే నేను ప్రతి సంవత్సరం ఈ ఆసుపత్రికి వస్తుంటాను. ఇక ముందు కూడా వస్తాను. ఈ ఆసుపత్రి చేసే సేవకు మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. నా ఏడాది జీతం ఈ ట్రస్ట్ కు అందిస్తాను