ఆ ప్రాజెక్టులను వెంటనే అభివృద్ధి చేయాలి

త్రికాల తెలుగు  ఆంధ్రప్రదేశ్ అమరావతి

రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురువారం జూలై 16, 2026న సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టింది. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్ పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా అన్ని పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్ లో అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. పరిశ్రమలు, మౌలికసదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో రూ.1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతి లో ఉన్నాయి. ఆర్ధిక మంత్రి  పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్