♦
త్రికాల తెలుగు : గురువారం జులై 9 2026
సింగరేణి రెండో విడత బాయిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని PVK 5 గనిలోకి దిగి పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..
- *నిజాం మనకు 17 గనులు ఇస్తే ఈ కేంద్రం వాటిని గుంజుకొని మనకు మళ్లీ ఒక్కటి ఇచ్చింది*
- *మిగతా 16 గనులు ఇచ్చే వరకు కిషన్ రెడ్డి వెంటబడుతాం*
- *మెడికల్ బోర్డు పై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20 న నిరాహార దీక్ష చేస్తా*
- *ధర్మం మన వైపు ఉన్నప్పుడు ఎదురుగా ఉండేది ఎవరైనా భయపకుండా కొట్లాడాలి*
- *నన్ను చూడండి…ధర్మం కోసం అందరితో ధైర్యంగా కొట్లాడుతున్న*
- తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా సింగరేణి కార్మికుల కోసం నేను కొట్లాడుతున్నా.
- ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టాం. మీ ఆశీర్వాదం కోసం బాయిబాట కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చాను.
- నేను కష్టాల్లో ఉన్నప్పుడు హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ గారు నాకు అండగా నిలిచారు.
- సింగరేణి కార్మికుల కోసం అలుపెరగని పోరాటం చేశారని, మీతో మా సంఘం నిలబడుతుందని చెప్పటం నా అదృష్టం.
- ఆయనకు తోడు మాజీ మంత్రి గా పనిచేసిన బోడ జనార్థన్ గారు కూడా మాతో కలిశారు.
- వారి అనుభవాన్ని ఉపయోగించుకోని మేము సింగరేణి కార్మికులకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తాం.
- సింగరేణి కార్మికుల దయ, త్యాగాల ద్వారా తెలంగాణ వచ్చింది.
- అందుకే తెలంగాణ వచ్చాక సింగరేణికి లాభం జరగాలని మనం డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చేలా చేసుకున్నాం.
- అప్పుడు నెలకు రెండు మెడికల్ బోర్డులు పెట్టి 20 వేల యువ రక్తం సింగరేణిలో చేరేందుకు నేను ఎంతో కష్టపడ్డాను.
- ఇప్పుడు ప్రభుత్వం మారింది. కానీ కార్మికుల పని ఏమీ మారలేదు. అయిన సరే కార్మికుల హక్కులను తొలగిస్తున్నారు.
- మంత్లీ రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. డిపెండెంట్ ఉద్యోగాలు కొనసాగించాలి.
- పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ అయ్యాక నెలకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టాలి.
- ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు పెట్టింది.
- అది కూడా అవినీతి మయం. 54 మంది అప్లయ్ చేసుకుంటే నలుగురికి మాత్రమే ఇచ్చారు.
- గత బాయిబాట కార్యక్రమంలో మెడికల్ బోర్డు పెట్టకపోతే ఈ నెల 20 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించాను.
- దాంతో ప్రభుత్వం లీకులు ఇస్తోంది. కానీ మెడికల్ బోర్డుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే ఈ నెల 20 న నిరాహార దీక్ష చేస్తాను.
- పాలకులకు మనసుంటే సింగరేణి ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వొచ్చు.
- మన హక్కుల కోసం మనం కచ్చితంగా కొట్లాడాలి.
- సింగరేణికి నిజాం రాజు రాసిచ్చిన 17 లో ఒక్కటి మనకు మళ్లీ ఇచ్చారు.
- దానికే ఏదో గొప్ప పని చేసినట్లు కిషన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు.
- కానీ ఇప్పుడు ఒక్కటి తో మొదలైంది. ఇంకా 16 మైన్లు ఇచ్చే వరకు కిషన్ రెడ్డి వెంట పడుతాం. సింగరేణిని కాపాడుకుంటాం
- కచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది.
- అప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని సింగరేణిలో ఆధ్వర్యంలో నడిచేలా చేస్తాం.
- ఈ రాష్ట్రంలో ఇసుకను కూడా సింగరేణి యే తీయాలి.
- కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న బూట్లు, గ్లౌజ్ లు చాలా నాసిరకంగా ఉన్నాయి.
- అధికారులు బ్రిటిష్ కాలం నాటి మాదిరిగా ప్రవర్తించవద్దు.
- మనది భారత దేశం, ప్రజాస్వామ్యం. కార్మికులను ఇబ్బంది పెట్టకుండా వారికోసం అధికారులు పనిచేయాలి.
- అధికారులకు, కార్మికులకు అన్నం పెట్టేది సింగరేణి అమ్మే. మీరు ఎక్కువ, వాళ్లు తక్కువ కాదు.
- కార్మికుల కోసం మీరు పనిచేస్తే మీ హక్కుల కోసం కార్మికులు పనిచేస్తారు.
- కనీసం నీళ్లు, సరైన గాలి ఇవ్వకుండా 14 గంటలు కార్మికులను పనిచేయిస్తుండటం అన్యాయం.
- కార్మిక చట్టాల గురించి సింగరేణిలో ఉన్న యువకులు తెలుసుకోవాలి.
- మీ హక్కుల కోసం అధికారులపై పోరాడేందుకు భయపడవద్దు. ధర్మం మనవైపు ఉంటే ఎదురుగా ఎవరున్నా సరే కొట్లాడాలి.
- నన్ను చూడండి. ధర్మం కోసం అందరితో పోరాటం చేస్తున్నాను.
- కేంద్ర ప్రభుత్వం 25 లేబర్ చట్టాలను 4 కు కుదించి కార్మికుల హక్కులను కాలరాస్తోంది.
- స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ చట్టాలను అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయించాలి.
- అప్పుడు మాత్రమే మీరు కార్మికుల కోసం పనిచేస్తున్నట్లు నమ్ముతాం.
- ఎర్రజెండా కప్పుకొని కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయవద్దని కోరుతున్నా.