చలో సరూర్‌ నగర్‌..సబితా హౌస్ అరెస్ట్

త్రికాల తెలుగు : హైదరాబాద్ : హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ “యువ సంగ్రామ సదస్సు”ను అడ్డుకునేందుకు యత్నం. యువసంగ్రామ సదస్సుకు హాజరుకాకుండా మాజీమంత్రి,మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

నిరుద్యోగ సమస్యలు, యువత హక్కుల సాధనకై సదస్సుకు హాజరవుతున్న మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు అప్రజాస్వామికంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు.

“కోర్టు అనుమతితో సరూర్‌నగర్‌ లో సభ నిర్వహిస్తుంటే అడ్డుకోవడం ఏంటి? నిరుద్యోగుల పట్ల వివక్ష చూపడం రేవంత్ ప్రభుత్వానికి తగదు. పోలీసుల తీరుపై తీవ్రంగా ఖండిస్తున్నాం- మాజీ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి

నిరుద్యోగ యువతకు ధోకా చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ మరోసారి పోరుబాట పట్టింది. మూడేండ్ల కిందట సరూర్‌నగర్‌ సభలో యూత్‌ డిక్లరేషన్‌ పేరిట బోగస్‌ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎండగట్టేందుకు సమాయత్తమైంది. నిరుద్యోగ యువతకు మొదటినుంచీ వెన్నుదన్నుగా ఉన్న గులాబీ పార్టీ.. అటు చట్టసభల్లో ఇటు ప్రజాక్షేత్రంలో గళమెత్తుతూ వస్తున్నది. అంతేగాక CM రేవంత్‌ ప్రభుత్వ అణచివేతలు, నిర్బంధాలను ఎదిరిస్తూనే రాష్ట్రవ్యాప్తంగా అనేకమార్లు నిరసనలు చేపట్టింది. నిరుద్యోగ యువతతో కలిసి ధర్నాలు, ఆందోళనలకు దిగింది. తాజాగా అదే బాటలో మరోసారి మోసపూరిత సర్కార్‌ కండ్లు తెరిపించేందుకు శనివారం శనివారం జూలై 18,2026న ఉదయం ‘చలో సరూర్‌నగర్‌’ పేరిట యువ సంగ్రామ సదస్సు నిర్వహించనుంది.

ట్రెండింగ్ న్యూస్