క్యాన్సర్ మందుల ధరలు భారీగా తగ్గించిన మోదీ జీ సర్కార్

  • క్యాన్సర్ మందుల అధిక ధరలకు భారీ తగ‌్గింపు..
  • గరిష్ఠంగా 96.45 శాతం తగ్గింపు.. ఏటా రూ.3,540 కోట్ల ఆదా!

క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఖరీదైన క్యాన్సర్ ఔషధాల ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం నవంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో క్యాన్సర్ చికిత్స పొందుతున్న లక్షలాది మంది రోగులకు ఆర్థిక భారం తగ్గనుంది.

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను నియంత్రించడంతో ధరలు గణనీయంగా తగ్గాయి. మొత్తం 1,364 ఔషధ ఫార్ములేషన్ల సవరించిన గరిష్ఠ చిల్లర ధరలు అమల్లోకి వచ్చాయి.

కొన్ని బ్రాండ్ల మందుల ధరలు ఏకంగా 96.45 శాతం వరకు తగ్గడం విశేషం. 679 బ్రాండ్ల మందుల ధరలు 50 శాతానికి పైగా తగ్గాయి. ఈ నిర్ణయంతో వినియోగదారులకు ఏడాదికి సుమారు 3,540 కోట్ల 38 లక్షల రూపాయలు ఆదా అవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అయితే మందుల ధరలు తగ్గాయో లేదో తెలుసుకోవడానికి ప్రజలు ఫార్మా సహీ దామ్ మొబైల్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. మందుల ప్యాకెట్‌పై ముద్రించిన కొత్త ఎంఆర్‌పీని కూడా పరిశీలించాలి.

ముఖ్యంగా.. నిర్ణయించిన ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఫార్మా జన్ సమాధాన్ పోర్టల్ ద్వారా ఎన్‌పీపీఏకు ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1800-111-255 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

మొత్తానికి.. క్యాన్సర్‌తో పోరాడుతున్న రోగులకు మందుల ఖర్చు భారాన్ని తగ్గించడంతో పాటు, నాణ్యమైన వైద్యం మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.

  • క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ‌్గింపు

  • గరిష్ఠంగా 96.45 శాతం వరకు తగ్గుదల 

  • ఏటా రూ.3,540 కోట్లకు పైగా ఆదా

  • నవంబర్ 9 నుంచి కొత్త ధరలు అమల్లోకి

  • అధిక ధరలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి

  • ఫార్మా సహీ దామ్ యాప్‌తో ధరలు తెలుసుకోండి !

ట్రెండింగ్ న్యూస్