నేలపై మన జాతీయ జెండా..వంగి తీసుకున్న మోదీ జీ..ట్రంప్ రియాక్షన్ చూడండి ▶️

  • నేలపై భారతీయ జాతీయ జెండా..
  • వెంటనే వంగి తీసుకున్న మోదీ జీ !
  • మోదీ చర్యకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఫిదా

క్వాడ్ దేశాధినేతల గ్రూప్ ఫొటో సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నేలపై ఉన్న భారత జాతీయ జెండాను గమనించిన ప్రధాని మోదీ.. “”మా జాతీయ జెండాను నేలపై వదిలేయలేను””అని అంటూ వెంటనే వంగి జెండాను తీసుకుని జేబులో పెట్టుకున్నారు.  అది చూసి వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ..“సేవ్ ఇట్“ / “కీప్ ఇట్” ( భద్రపరుచుకోండి ) అంటూ మోదీకి సూచించారు. జాతీయ జెండాపై మోదీ చూపిన గౌరవం, ట్రంప్ స్పందనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయులు ఈ ఘటనను ఆసక్తిగా షేర్ చేసుకుంటున్నారు.

మరింత వివరంగా చెప్పాలంటే..అసలేం జరిగిందో  తెలుసా? మంగళవారం నవంబర్ 17, 2026న ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో క్వాడ్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత చివరిలో  దేశాధినేతలు గ్రూఫ్ ఫోటో దిగడానికి వచ్చారు. అయితే ఏ దేశాధినేత ఎక్కడ నిలబడాలో..ఆయా దేశాల జాతీయ జెండాలను కింద ఏర్పాటు చేస్తారు. అది గమనించిన ప్రధాని మోదీజీ మన జాతీయ జెండా  కింద ఉండటాన్ని గమనించారు…వంగి మన “జాతీయ జెండాను నేలపై వదలేయలేను” అంటూ ..వెంటనే తీసుకుని జేబులో పెట్టుకున్నారు. మోదీ చర్యకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ఫిదా అయ్యారు. ఆయన స్పందిస్తూ..సేవ్ ఇట్ / కీప్ ఇట్ ( దానిని మీ దగ్గరే భద్రంగా ఉంచుకోండి ) అంటూ సూచించారు. ఇప్పుడే కాదు గతంలోనూ చాలా సమావేశాలు సందర్భంగా ఇలాంటి సన్నివేశం ఆవిష్కృతమైంది. మోదీ మన దేశం పై ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరిచారు.

అంటే..చూడండి భారత జాతీయ జెండాపై ప్రధాని మోదీ చూపిన గౌరవం..దానికి ట్రంప్ ఇచ్చిన స్పందన ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చిన్న సంఘటన దేశభక్తి, జాతీయ జెండా గౌరవం గురించి మరోసారి చర్చకు తెరలేపింది. ఈ వీడియోను భారతీయులు ఒకరికొరు షేర్లు చేసుకుంటూ..మోదీ చేసిన ఈ పనిని గొప్పగా చర్చించుకుంటున్నారు.

క్వాడ్ (QUAD – Quadrilateral Security Dialogue) అనేది నాలుగు దేశాల అనధికారిక వ్యూహాత్మక భద్రతా కూటమి..

క్వాడ్ దేశాలు:

• భారతదేశం (India)

• అమెరికా (United States)

• జపాన్ (Japan)

• ఆస్ట్రేలియా (Australia)

ముఖ్య వివరాలు:

• లక్ష్యం: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం మరియు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం.

• ప్రారంభం: ఇది తొలిసారిగా 2007లో ఏర్పాటైంది, ఆ తర్వాత కొంతకాలం నిద్రాణంగా ఉండి 2017లో తిరిగి పునరుద్ధరించబడింది.

• తాజా పరిణామాలు: ఇటీవలే మనీలాలో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో నౌకాదళ విన్యాసాలు, సముద్ర నిఘా, ఏఐ మరియు సైబర్ భద్రతలో కొత్త భాగస్వామ్యాలపై నిర్ణయాలు తీసుకున్నారు

ట్రెండింగ్ న్యూస్