రొమ్ము క్యాన్సర్ మందు ధరలో 93 శాతం తగ్గించిన మోదీ జీ సర్కార్

  • రొమ్ము క్యాన్సర్ మందు ధరలో 93 శాతం తగ‌్గింపు..
  • రూ.40 వేల మందు ఇప్పుడు రూ.2,720కే !

రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు భారీ ఊరట కలిగించే నిర్ణయం అమల్లోకి వచ్చింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన పాల్బోసిక్లిబ్ 125 ఎంజీ ఔషధం ధర భారీగా తగ్గింది.

గతంలో ఈ ఔషధానికి చెందిన ఓ బ్రాండ్ ప్యాక్ ధర ఏకంగా 40 వేల 421 రూపాయలుగా ఉండేది. తాజాగా సవరించిన ధరల ప్రకారం అదే ప్యాక్ ధర 2 వేల 720 రూపాయలకు తగ్గింది.

అంటే దాదాపు 93 శాతం ధర తగ్గింపు నమోదైంది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన పాల్బోసిక్లిబ్ ఔషధాల సవరించిన గరిష్ఠ చిల్లర ధరలు ప్రస్తుతం 792 రూపాయల నుంచి 2,720 రూపాయల మధ్య ఉన్నాయి.

క్యాన్సర్ చికిత్స కోసం నెలనెలా వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన రోగులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగించనుంది.

ఇప్పటికే క్యాన్సర్ నిరోధక ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల తగ్గింపు నిర్ణయం అమల్లోకి రావడంతో రోగులు కొత్త ఎంఆర్‌పీ ప్రకారమే మందులు కొనుగోలు చేయవచ్చు.

మొత్తానికి.. క్యాన్సర్ చికిత్సలో మందుల ఖర్చు తగ్గించడం ద్వారా సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే దిశగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

 

  • రొమ్ము క్యాన్సర్ మందు ధరలో 93 శాతం కోత!

  • రూ.40,421 మందు ఇప్పుడు రూ.2,720కే!

  • క్యాన్సర్ రోగులకు భారీ ఆర్థిక ఊరట!

  • పాల్బోసిక్లిబ్ ఔషధం ధర తగ్గింపు అమల్లోకి!

ట్రెండింగ్ న్యూస్