
- *సీనియర్ సిటిజన్స్ భూమిని వాళ్లకే స్వాధీనం చేయిస్తాం*
- *రెవెన్యూ మంత్రి ఆదేశాలతో తిరుపతిలో భూకబ్జాలు మంచిది కాదు*
*సిపిఐ జాతీయ నాయకులు కే నారాయణ*
త్రికాల తెలుగు : బుధవారం జూలై 8 2026: తిరుపతి అవిలాల చుట్టుపక్కల విలువైన భూములు అన్యాక్రాంతము అవుతున్నాయని దౌర్జన్యాలు స్థానిక టిడిపి నాయకులు ప్రవేశం ఎమ్మెల్యే ప్రవేశం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు సిపిఐ జాతీయ నాయకులు కే నారాయణ తీవ్రంగా ఆరోపించారు బుధవారం బాలాజీ కాలనీలోని సీనియర్ సిటిజన్స్ అయిన నల్లపరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వనజ ల ఇంటికెళ్లి వాళ్లను పరామర్శించారు. ఈ సందర్భంగా కే నారాయణ మాట్లాడుతూ తిరుపతి అత్యంత పవిత్రమైనదని ఇలాంటి చోట్ల దౌర్జన్యాలు రౌడీయిజాలు మంచిది కాదని ఇలా జరిగితే ఇది టిడిపి పైనాయకత్వానికి తీరని మచ్చగా ఉంటుందని అన్నారు. అవిలాల సర్వే నంబర్ 476/ 1 లో మూడు ఎకరాల 17 సెంట్లు భూమిని వనజ గారి కష్టార్జితంతో వారి భర్త దొరకనాథరెడ్డి ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో కొనుగోలు తీసుకున్న భూమిని ఈరోజు విజయవాడలోనే కైకలూరు కు చెందిన దోనేపూడి శివ నాగ ప్రసాద్ పేరుతో రిజిస్టర్ కావడం అంటే దీని వెనక రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ కు బినామీగా ఉన్నదని తేలింది అన్నారు రెవెన్యూ మంత్రి సహకారం లేకుండా ఇవన్నీ జరగవు అందుకే టిడిపికి నేరుగా చెప్తున్నా మీ మంత్రులే నేరుగా ల్యాండ్ కబ్జాలకు దౌర్జన్యాలకు రౌడీయిజాన్కు పాల్పడడం ఏమిటని ఆయన గట్టిగా ప్రశ్నించారు రౌడీలను పెట్టి సీనియర్ సిటిజన్స్ పై దాడి చేయించడం మంచిది కాదన్నారు డాక్యుమెంట్ మొత్తం పరిశీలన చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా అనామకులే పోలీస్ స్టేషన్లలో పాస్ ఫోటోలు పెట్టి ఎలా దొంగల లిస్టు ప్రకటిస్తారో దీన్ని చూస్తే అలా ఉందని ఉద్యోగం చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ పోలీస్ రెండు ఈ విధంగా చేస్తుంటే చట్టం ఊరుకోదని వారిని హెచ్చరించారు భవిష్యత్తులో ఈ చెడ్డ పేరు అంతా రాష్ట్ర టిడిపి నాయకులకే వర్తిస్తుందని తెలుసుకోవాలన్నారు ఏది ఏమైనా చివరికి వనజ గారి భూమిని వాళ్లకే స్వాధీనం చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ జాతీయ నేత కే నారాయణ తో పాటు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య నగర కార్యదర్శి జే విశ్వనాథ్ సీనియర్ లాయర్ గుర్రప్ప నాయుడు తదితరులు ఉన్నారు.