

త్రికాల తెలుగు, హైదరాబాద్: జై భారత్ నాయకుడు రమణమూర్తిపై కశ్యప్ రెడ్డి జరిపిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండించిన వివిధ పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు.
విజయ విహారం ఎడిటర్ రమణమూర్తి.పై దాడిని ఖండిస్తూ బుధవారం, జూలై 15, 2026న హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో వివిధ పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు ప్రత్యేక సమావేశం అయ్యారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్ లో రమణమూర్తిపై జరిగిన దాడి ఘటనపై సమాలోచన చేసి భౌతిక దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనానా సరే భిన్నాభిప్రాయాలను గౌరవించాలన్నారు. కానీ ఇలాంటి అనాగరిక పద్ధతుల్లో దాడులకు పాల్పడటం భావప్రకటన స్వేచ్ఛపై జరిగిన దాడేనని అభివర్ణించారు. భారత రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యాన్ని చర్చల ద్వారా ఉపయోగించుకోవాలే తప్ప, భౌతిక దాడులు చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ దాడికి పాల్పడిన కశ్యప్ రెడ్డిపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని..వివిధ పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు.