స్కైరూట్ విక్రమ్-1 ప్రయోగం సక్సెస్ ▶️🔥

స్కైరూట్ విక్రమ్-1 (Mission Aagaman) ప్రయోగం విజయవంతం
హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్‌ను శనివారం జూలై 18 2026న  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

ఇది భారతదేశంలో ప్రైవేట్ కంపెనీ రూపొందించిన తొలి ఆర్బిటల్ రాకెట్ విజయవంతమైన ప్రయోగంగా చరిత్ర సృష్టించింది.

రాకెట్ సుమారు 450 కిమీ లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) లోకి పలు పేలోడ్లను విజయవంతంగా ప్రవేశపెట్టింది. విక్రమ్-1లో కార్బన్ కాంపోజిట్ నిర్మాణం, 3D-ప్రింటెడ్ ఇంజిన్ వంటి ఆధునిక సాంకేతికతలు ఉపయోగించారు.

ఈ విజయంతో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కీలక మైలురాయి ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

శ్రీహ‌రికోట‌లోని ఫ‌స్ట్ ల్యాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ 12.05 నిమిషాల‌కు నింగిలోకి దూసుకెళ్లింది. అయితే 11.30 నిమిషాల‌కే ఎగ‌రాల్సిన ఆ రాకెట్‌లో నావిగేష‌న్ లోపాలు త‌లెత్త‌డంతో ప్ర‌యోగాన్ని రీషెడ్యూల్ చేశారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరికి ప్రయోగం సక్సెస్ అయింది.

ట్రెండింగ్ న్యూస్