
ఒడిశా త్రికాల :
ఒడిశాలో 20 లక్షల ఓట్ల తొలగింపు
ఒడిశాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్ – SIR) ప్రక్రియలో భాగంగా 2025 తుది ఓటరు జాబితా, 2002 నాటి ఓటరు నమోదులను సరిపోల్చి ముసాయిదా జాబితాను రూపొందించారు. ఈ ప్రక్రియలో మరణాలు, నివాస మార్పులు, నకిలీ నమోదులు తదితర కారణాలతో 20 లక్షలకుపైగా ఓటర్ల పేర్లు తొలగించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే ఈ తొలగింపులపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పారదర్శక విచారణ కోరుతున్నాయి..