దమ్ముంటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుండ్రి 😳

త్రికాల తెలుగు : గురువారం జులై 9 2026

సింగరేణి రెండో విడత బాయిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని PVK 5 గనిలోకి దిగి పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత  

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..

  •  *నిజాం మనకు 17 గనులు ఇస్తే ఈ కేంద్రం వాటిని గుంజుకొని మనకు మళ్లీ ఒక్కటి ఇచ్చింది*
  •  *మిగతా 16 గనులు ఇచ్చే వరకు కిషన్ రెడ్డి వెంటబడుతాం*
  •  *మెడికల్ బోర్డు పై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ నెల 20 న నిరాహార దీక్ష చేస్తా*
  •  *ధర్మం మన వైపు ఉన్నప్పుడు ఎదురుగా ఉండేది ఎవరైనా భయపకుండా కొట్లాడాలి*
  •  *నన్ను చూడండి…ధర్మం కోసం అందరితో ధైర్యంగా కొట్లాడుతున్న*
  • తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా సింగరేణి కార్మికుల కోసం నేను కొట్లాడుతున్నా.
  • ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టాం. మీ ఆశీర్వాదం కోసం బాయిబాట కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చాను.
  • నేను కష్టాల్లో ఉన్నప్పుడు హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ గారు నాకు అండగా నిలిచారు.
  • సింగరేణి కార్మికుల కోసం అలుపెరగని పోరాటం చేశారని, మీతో మా సంఘం నిలబడుతుందని చెప్పటం నా అదృష్టం.
  • ఆయనకు తోడు మాజీ మంత్రి గా పనిచేసిన బోడ జనార్థన్ గారు కూడా మాతో కలిశారు.
  • వారి అనుభవాన్ని ఉపయోగించుకోని మేము సింగరేణి కార్మికులకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తాం.
  • సింగరేణి కార్మికుల దయ, త్యాగాల ద్వారా తెలంగాణ వచ్చింది.
  • అందుకే తెలంగాణ వచ్చాక సింగరేణికి లాభం జరగాలని మనం డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చేలా చేసుకున్నాం.
  • అప్పుడు నెలకు రెండు మెడికల్ బోర్డులు పెట్టి 20 వేల యువ రక్తం సింగరేణిలో చేరేందుకు నేను ఎంతో కష్టపడ్డాను.
  • ఇప్పుడు ప్రభుత్వం మారింది. కానీ కార్మికుల పని ఏమీ మారలేదు. అయిన సరే కార్మికుల హక్కులను తొలగిస్తున్నారు.
  • మంత్లీ రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టాలి. డిపెండెంట్ ఉద్యోగాలు కొనసాగించాలి.
  • పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు క్లియర్ అయ్యాక నెలకు ఒకసారి మెడికల్ బోర్డు పెట్టాలి.
  • ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు పెట్టింది.
  • అది కూడా అవినీతి మయం. 54 మంది అప్లయ్ చేసుకుంటే నలుగురికి మాత్రమే ఇచ్చారు.
  • గత బాయిబాట కార్యక్రమంలో మెడికల్ బోర్డు పెట్టకపోతే ఈ నెల 20 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించాను.
  • దాంతో ప్రభుత్వం లీకులు ఇస్తోంది. కానీ మెడికల్ బోర్డుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే ఈ నెల 20 న నిరాహార దీక్ష చేస్తాను.
  • పాలకులకు మనసుంటే సింగరేణి ద్వారా లక్షల ఉద్యోగాలు ఇవ్వొచ్చు.
  • మన హక్కుల కోసం మనం కచ్చితంగా కొట్లాడాలి.
  • సింగరేణికి నిజాం రాజు రాసిచ్చిన 17 లో ఒక్కటి మనకు మళ్లీ ఇచ్చారు.
  • దానికే ఏదో గొప్ప పని చేసినట్లు కిషన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు.
  • కానీ ఇప్పుడు ఒక్కటి తో మొదలైంది. ఇంకా 16 మైన్లు ఇచ్చే వరకు కిషన్ రెడ్డి వెంట పడుతాం. సింగరేణిని కాపాడుకుంటాం
  • కచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది.
  • అప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని సింగరేణిలో ఆధ్వర్యంలో నడిచేలా చేస్తాం.
  • ఈ రాష్ట్రంలో ఇసుకను కూడా సింగరేణి యే తీయాలి.
  • కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న బూట్లు, గ్లౌజ్ లు చాలా నాసిరకంగా ఉన్నాయి.
  • అధికారులు బ్రిటిష్ కాలం నాటి మాదిరిగా ప్రవర్తించవద్దు.
  • మనది భారత దేశం, ప్రజాస్వామ్యం. కార్మికులను ఇబ్బంది పెట్టకుండా వారికోసం అధికారులు పనిచేయాలి.
  • అధికారులకు, కార్మికులకు అన్నం పెట్టేది సింగరేణి అమ్మే. మీరు ఎక్కువ, వాళ్లు తక్కువ కాదు.
  • కార్మికుల కోసం మీరు పనిచేస్తే మీ హక్కుల కోసం కార్మికులు పనిచేస్తారు.
  • కనీసం నీళ్లు, సరైన గాలి ఇవ్వకుండా 14 గంటలు కార్మికులను పనిచేయిస్తుండటం అన్యాయం.
  • కార్మిక చట్టాల గురించి సింగరేణిలో ఉన్న యువకులు తెలుసుకోవాలి.
  • మీ హక్కుల కోసం అధికారులపై పోరాడేందుకు భయపడవద్దు. ధర్మం మనవైపు ఉంటే ఎదురుగా ఎవరున్నా సరే కొట్లాడాలి.
  • నన్ను చూడండి. ధర్మం కోసం అందరితో పోరాటం చేస్తున్నాను.
  • కేంద్ర ప్రభుత్వం 25 లేబర్ చట్టాలను 4 కు కుదించి కార్మికుల హక్కులను కాలరాస్తోంది.
  • స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ చట్టాలను అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయించాలి.
  • అప్పుడు మాత్రమే మీరు కార్మికుల కోసం పనిచేస్తున్నట్లు నమ్ముతాం.
  • ఎర్రజెండా కప్పుకొని కార్మికులకు వ్యతిరేకంగా పనిచేయవద్దని కోరుతున్నా.

ట్రెండింగ్ న్యూస్