అణు యుద్ధం వద్దు.. ప్రపంచ శాంతే ముద్దు !

  • అణు యుద్ధం వద్దు.. ప్రపంచ శాంతే ముద్దు!
  • అమెరికా, రష్యా, చైనా చారిత్రాత్మక ప్రకటన..
  • అణు ముప్పు తగ్గించేందుకు మూడు దేశాల కీలక నిర్ణయం!

ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా దేశాలు ప్రపంచ శాంతి దిశగా కీలక అడుగు వేశాయి. చైనాలోని షెన్‌జెన్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారిగా త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.

ఈ భేటీ అనంతరం మూడు దేశాలు సంయుక్తంగా ‘డిక్లరేషన్ టువార్డ్స్ పీస్’ పేరుతో శాంతి ప్రకటనను విడుదల చేశాయి. అణు యుద్ధం ద్వారా ఎవరూ విజయం సాధించలేరని.. అలాంటి యుద్ధం ఎప్పటికీ జరగకూడదని మూడు దేశాల అధినేతలు స్పష్టం చేశారు.

అణ్వాయుధాల వినియోగం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడంతో పాటు, అణ్వాయుధాల విస్తరణను నిరోధించేందుకు పరస్పర చర్చలు జరపాలని నిర్ణయించాయి. ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, అంతర్జాతీయంగా ఇంధన సరఫరా స్థిరంగా కొనసాగించడం వంటి అంశాలపైనా ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.

అంతేకాదు.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వంటి సంస్థలు తమ అధికార పరిధిని దుర్వినియోగం చేయకూడదని కూడా ప్రకటనలో పేర్కొన్నాయి.

అయితే ఈ చారిత్రాత్మక భేటీలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌ యుద్ధం వంటి కీలక అంశాలపై సంయుక్త ప్రకటనలో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. మొత్తంగా ప్రపంచంలో అణు ముప్పును తగ్గించి, శాంతి స్థాపనకు మూడు అగ్రరాజ్యాలు చేసిన ఈ ప్రయత్నం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

  • అణు యుద్ధం వద్దు.. ప్రపంచ శాంతే ముద్దు!

  • ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ!

  • అణు ముప్పు తగ్గింపునకు మూడు అగ్రరాజ్యాల అంగీకారం!

  • ఇంధన సరఫరా స్థిరత్వానికి కీలక నిర్ణయం!

ట్రెండింగ్ న్యూస్