వైఎస్ అంజలి రెడ్డి హల్దీ వేడుకలు

  • షర్మిల, బ్రదర్ అనిల్ ఇంట్లో పెళ్లి సందడి!
  • అంజలి రెడ్డి హల్దీ వేడుకలు ఘనంగా నిర్వహణ!
  • ఈ నెల 25న అంజలి రెడ్డి వివాహం!
  • సోషల్ మీడియాలో వైరల్‌గా హల్దీ వేడుకల ఫొటోలు!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల ఇంట పెళ్లి సందడి మొదలైంది. వారి కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుకల్లో భాగంగా హల్దీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకలో షర్మిల దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పసుపు వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన డాక్టర్ సోమల రఘురాం రెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరగనుంది. సెప్టెంబర్ 24న వీరి నిశ్చితార్థం జరగగా.. ఈ నెల 25న వివాహ ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాబోయే వధూవరులకు రాజకీయ ప్రముఖులు, పార్టీ శ్రేణులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్రెండింగ్ న్యూస్