ఆగస్టు 18 నుంచి 27 వరకు తీజ్ ఉత్సవాలు

ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ ఉత్సవాలు నిర్వహించాలి – గోర్ సేన
బంజారా సంస్కృతిని కాపాడాలని, తీజ్ పండగకు సెలవు ప్రకటించాలి- గోర్ సేన

త్రికాల తెలుగు : హనుమకొండ, జూలై 21: గోర్ సిక్వాడి, గోర్ సేన భారత్, తెలంగాణ కమిటీల పిలుపుమేరకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా గోర్ సేన అధ్యక్షులు మాలోతు చిట్టిబాబు నాయక్ మాట్లాడుతూ.. భారత దేశంలోని దాదాపు 12 కోట్ల మంది సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పండగను అన్ని తండాలలో, నగరాలలో ఘనంగా జరుపుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీజ్ పండగ నాడు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. గోర్ సేన అధ్యక్షులు సభవట్ మహేందర్ నాయక్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోర్ బంజారాలు శ్రావణమాసం ఆగస్టు 18 నుండి 27 వరకు తీజ్ పండగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

తీజ్ పండుగ అనేది సింధు నాగరికతకు ముందు నుండే బంజారాల వారసత్వ సంపదగా వస్తోందని అన్నారు. తొమ్మిది రోజులపాటు గోధుమ మొక్కలకు పెళ్లికాని యువతులు నీరు పోస్తూ, గోధుమ గడ్డి ఏపుగా పెరిగితే పంటలు కూడా అదేవిధంగా బాగా పండుతాయని నమ్ముతారని చెప్పారు. చివరి రోజున సేవాల్ మహారాజ్ కు భోగ్ బండారో కార్యక్రమం నిర్వహించి, మేరమా యాడికి పూజలు చేస్తామన్నారు.

తీజ్ పండుగ (తీజ్ తేవార్) – 10 రోజుల వివరాలు
తేదీలు: 18 ఆగస్టు 2026 నుండి 27 ఆగస్టు 2026 వరకు

*రోజు 1* 18.08.2026 మంగళవారం ఘంవ్ గలేరో – గోధుమ గింజల శుద్ది 

*రోజు 2* 19.08.2026 బుధవారం తీజ్ బోయెరో – గోధుమ గింజల విత్తనం

*రోజు 3* 20.08.2026 గురువారం బోరడి తీజ్

*రోజు 4* 21.08.2026 శుక్రవారం గోర్ బంజారా చరిత్ర, మహా యోధులు, సంస్కృతిపై ప్రసంగాలు

*రోజు 5* 22.08.2026 శనివారం బంజారా సాంస్కృతిక కార్యక్రమాలు – గీతాలు, నృత్యాలు, జానపద ఆటలు

*రోజు 6* 23.08.2026 ఆదివారం సంస్కృతిక కార్యం – రమణి

*రోజు 7* 24.08.2026 సోమవారం సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద ప్రదర్శనలు

*రోజు 8* 25.08.2026 మంగళవారం ఢమోళి – పూజలు, ప్రసంగాలు

*రోజు 9* 26.08.2026 బుధవారం ఘణ గోర్ తీజ్ – పూజలు, వ్రతాలు

*రోజు 10* 27.08.2026 గురువారం తీజ్ వెంటారా / కడవ పూజ, సేవాలాల్ భోగ్ , మేరమా యాడి పూజ, తీజ్ నిమజ్జనం.

ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ గోర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షులు సబావట్ మహేందర్ నాయక్,
భూక్య రవి నాయక్ చంద్రు తండా సర్పంచ్,విజయ్ నాయక్, దేవేందర్ నాయక్ వెంకన్న నాయక్ శ్రీధర్ నాయక్,నాగమణి బాయి సోనా బాయి,అనూష బాయి గోర్ సేన నాయకులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్