- కొంపముంచిన 80’s ట్రెండ్
- 45 ఏళ్ల నాటి కేసు రీఓపెన్
- 80’s ట్రెండ్.. మహిళకు షాక్
- ఫోటో చూసి గుర్తుపట్టిన స్వర్ణకారుడు
- : పేరు మార్చుకున్నా.. ఫొటోతో దొరికింది
త్రికాల తెలుగు: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 80’s ట్రెండ్ ఓ మహిళ కొంపముంచింది. ఏకంగా 45 ఏళ్ల క్రితం చేసిన దొంగతనాన్ని ఈ ట్రెండ్ బయటపెట్టింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఉజ్జయినిలోని ఓ స్వర్ణకారుడి దుకాణంలో 45 ఏళ్ల క్రితం ఓ మహిళ హారం దొంగలించింది. అనంతరం తన పేరు మార్చుకుని మరో ప్రాంతంలో జీవనం సాగిస్తోంది.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 80’s ట్రెండ్‌లో భాగంగా.. తన ఫొటోను అప్పటి కాలానికి అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అయితే, ఆ ఫొటోనే ఆమెను పోలీసులకు పట్టించింది. సదరు మహిళ ఫొటోను చూసిన స్వర్ణకారుడు.. 45 ఏళ్ల క్రితం తన దుకాణంలో హారం దొంగలించిన మహిళ ఈమెనే అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
దీంతో పోలీసులు పాత కేసును మరోసారి తెరిచి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు విషయం బయటపడింది. తానే 45 ఏళ్ల క్రితం హారం దొంగలించినట్లు మహిళ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.