- నాగ్‌పూర్‌లో SBI బ్యాంక్ దోపిడీ
- బ్యాంకు సిబ్బందిపై మిరపపొడి దాడి
- మిరపపొడి చల్లి రూ.4.53 లక్షలు దోపిడీ
- CCTVలో బ్యాంక్ దోపిడీ దృశ్యాలు
త్రికాల తెలుగు : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సక్కర్‌దరా ప్రాంతంలోని భాండే ప్లాట్ SBI బ్రాంచ్‌లో భారీ దోపిడీ జరిగింది. గురువారం ( సెప్టెంబర్ 10., 2026 ) న సాయంత్రం బ్యాంకు సిబ్బంది ATMలో నగదు నింపేందుకు తీసుకెళ్లిన డబ్బును తిరిగి తీసుకొస్తుండగా.. ఓ వ్యక్తి సాధారణ కస్టమర్‌లా వచ్చి…క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్ళాడు . ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాంక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దుండగుడి దాడితో బ్యాంకు సిబ్బంది అంతా షాక్ అయ్యారు.
దొంగ ఏం చేశాడు?
ముఖాన్ని తెల్లటి గుడ్డతో కప్పుకున్న వ్యక్తి బ్యాంకు సిబ్బందిపై ఎర్ర మిరప పొడి చల్లాడు. దీంతో సిబ్బంది కళ్లలో మంట, చూపు మందగించడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నగదు తీసుకుని పరారయ్యాడు.
ఎంత నగదు దోచుకెళ్లాడు?
తాజా రిపోర్టు ప్రకారం రూ.4.53 లక్షలు నగదు తీసుకెళ్లాడు. CCTV దృశ్యాల్లో నిందితుడు సంప్రదాయ దుస్తులు ధరించి, ముఖాన్ని కప్పుకుని బ్యాంకులోకి రావడం, సిబ్బందిపై మిరప పొడి చల్లడం, అనంతరం నగదుతో బయటకు వెళ్లడం కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిందితుడు ఎలా పట్టుబడ్డాడు?
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి CCTV ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. మరో నిందితుడిని త్వరగా అరెస్ట్ చేసి, దోచుకున్న నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్ర: నాగ్‌పూర్ SBI బ్యాంకులో దోపిడీ. బ్యాంకులో సాధారణ కస్టమర్‌లా వచ్చిన వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు.సిబ్బందిపై ఎర్ర మిరప పొడి చల్లాడు. నగదు తీసుకుని పరారయ్యాడు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి చివరికి అరెస్ట్ 10/09/2026 #sbi #cctv #mh pic.twitter.com/j6C44LpoXe
— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) September 11, 2026