మల్కాపూర్‌లో పౌష్టికాహార మాసోత్సవాలు

  • మల్కాపూర్‌లో పౌష్టికాహార మాసోత్సవాలు
  • గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన

మల్కాపూర్: సెప్టెంబర్ 18: త్రికాల తెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మత్తమాల సెక్టార్ పరిధిలోని రుద్రారం, అల్మాజీపూర్, మతమాల, జంగమ్మయిపల్లి, బ్రాహ్మణపల్లి అంగన్వాడీ కేంద్రాల టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గర్భిణీలు, బాలింతలు, ఆరు సంవత్సరాలలోపు చిన్నారులు, తల్లులకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించారు. ముఖ్యంగా థౌజండ్ గోల్డెన్ డేస్ ప్రాముఖ్యతను వివరించారు. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి చిన్నారి తొలి రెండు సంవత్సరాల వరకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకమని టీచర్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ICDS మత్తమాల సెక్టార్ సూపర్‌వైజర్ స్వప్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోషకాహారం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలను ఆమె వివరించారు. మల్కాపూర్ గ్రామ సర్పంచ్ కొండ యోగితా మధు ఆధ్వర్యంలో శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. గర్భిణీలకు పౌష్టికాహారం, ఆరోగ్యంపై సర్పంచ్ అవగాహన కల్పించారు.

  • మల్కాపూర్‌లో పౌష్టికాహార మాసోత్సవాలు
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న ICDS సూపర్‌వైజర్ స్వప్న 
  • మల్కాపూర్ సర్పంచ్ కొండ యోగితా మధు ఆధ్వర్యంలో శ్రీమంతం
  • చిన్నారులు,  గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారంపై సర్పంచ్ అవగాహన

ట్రెండింగ్ న్యూస్