- అగ్నివీరులకు కేంద్రం శుభవార్త..
- సైన్యంలో కొనసాగేందుకు మరో అవకాశం !
- మరో రెండేళ్లు సర్వీస్ పొడిగింపు..ఆ తర్వాత సైన్యంలో చేరేందుకు అవకాశం!
అగ్నివీరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రహ్మణి వెల్లడించారు. ఇప్పటివరకు అగ్నివీర్ పథకం కింద నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత 25 శాతం మంది మాత్రమే మెరిట్ ఆధారంగా సాయుధ దళాల్లో కొనసాగేందుకు అవకాశం ఉండేది. మిగిలిన 75 శాతం మంది పౌర జీవితంలోకి తిరిగి వెళ్లాల్సి వచ్చేది.
అయితే తాజాగా ఈ విధానంలో కీలక మార్పు చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన 75 శాతం అగ్నివీరులకు మరో రెండేళ్ల పాటు సర్వీస్ పొడిగించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ అదనపు రెండేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత సైన్యంలో కొనసాగేందుకు ఆసక్తి చూపే అగ్నివీరులను నిర్దిష్టమైన ఎంపిక ప్రమాణాల ఆధారంగా సాయుధ దళాల్లో చేర్చుకునే మార్గం కల్పించినట్లు వివరించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అగ్నివీరులకు సైన్యంలో దీర్ఘకాలికంగా సేవలందించే మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. యువతకు దేశ రక్షణ రంగంలో కెరీర్‌ను కొనసాగించేందుకు ఇది కీలక పరిణామంగా మారనుంది. అయితే సైన్యంలో శాశ్వత నియామకం అందరికీ ఆటోమేటిక్‌గా లభించదు. నిర్దేశిత అర్హతలు, ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు సీఎండీఎస్ స్పష్టం చేశారు.
#Cabinet has created a pathway for all #Agniveers to be absorbed into the Indian Defence Forces.
As you know, 25% of Agniveers will enrolled in the Forces, based on merit. Previously, the Scheme envisaged that 75% of Agniveers would transition back into civilian life as… pic.twitter.com/EicMLXX85S— PIB India (@PIB_India) November 4, 2026