గిరిజన భాషల పరిరక్షణకు ఏఐ అండ..11 భాషలు ఒకే వేదికపైకి !

  • గిరిజన భాషల పరిరక్షణకు ఏఐ అండ..
  • 11 భాషలను ఒకే వేదికపైకి తెచ్చిన ఆదివాణి!
  • ఏఐతో గిరిజన భాషలకు కొత్త జీవం..!
  • 11 భాషలకు ఒకే డిజిటల్ వేదిక..
  • కేంద్రం, ఐఐటీ ఢిల్లీ సంయుక్తంగా ఆదివాణి!
  • గిరిజన భాషల పరిరక్షణకు ఏఐ అండ
  • 11 భాషలకు ఒకే డిజిటల్ వేదిక
  • కేంద్రం, ఐఐటీ ఢిల్లీ వినూత్న ప్రయోగం
  • భావితరాలకు భాషా వారసత్వం భద్రం

భారతదేశ గొప్ప గిరిజన భాషా వారసత్వాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తోంది. అంతరించిపోతున్న గిరిజన భాషలను భావితరాలకు అందించడంతో పాటు, భాషాపరమైన అడ్డంకులను తొలగించే లక్ష్యంతో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఐఐటీ ఢిల్లీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత డిజిటల్ వేదికే ‘ఆదివాణి’. ఈ వేదిక ద్వారా 11 గిరిజన భాషలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు.

ఆదివాణి ద్వారా పాఠ్యాంశాల అనువాదం, మాటలను మరో భాషలోకి మార్చడం, ఓసీఆర్ సాంకేతికతతో పత్రాల్లోని సమాచారాన్ని గుర్తించి అనువదించడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. గిరిజన భాషలను నేర్చుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు, వీడియోలకు ఉపశీర్షికలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ వేదిక అందిస్తోంది.

దీంతో భాషాపరమైన దూరం తగ్గడమే కాకుండా, గిరిజన ప్రాంతాల్లో విద్య, సమాచార ప్రసారం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న భాషలను డిజిటల్ రూపంలో భద్రపరచడానికి ఈ సాంకేతికత దోహదపడనుంది.

సాంకేతికతను కేవలం ఆధునిక అవసరాలకే కాకుండా.. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భాషా వైవిధ్యాన్ని కాపాడేందుకు కూడా వినియోగించవచ్చని ఆదివాణి వేదిక నిరూపిస్తోంది.

ట్రెండింగ్ న్యూస్