- పోలీసులపై కాంగ్రెస్ నేత ఆరోపణలు
- వినాయక నిమజ్జనం వేళ వాగ్వాదం
- బట్టలూడదీసి కొట్టారంటూ ఆరోపణ
- 26 ఏళ్ల కాంగ్రెస్ సేవకు ఇదే గౌరవమా?
- న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటాం- బాలకృష్ణ
పరిగి, సెప్టెంబర్ 27: త్రికాల తెలుగు : వికారాబాద్ జిల్లా పరిగిలో పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆరోపణలు చేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన వాగ్వాదం అనంతరం తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, బట్టలూడదీసి విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారని టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్కని బాలకృష్ణ ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఎం జరిగింది ?
వినాయక నిమజ్జనం సమయంలో PACS చైర్మన్ పార్థసారథి, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్కని బాలకృష్ణ మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పార్థసారథికి క్షమాపణలు చెప్పినప్పటికీ పోలీసులు తనను స్టేషన్కు తీసుకెళ్లారని బాలకృష్ణ తెలిపారు.
పోలీస్ స్టేషన్లో తనను బట్టలూడదీసి విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారని బాలకృష్ణ ఆరోపించారు. తనపై దాడి చేయడానికి పోలీసులకు ఎవరి మద్దతు ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
26 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తనకు దక్కిన గౌరవం ఇదేనా అంటూ బుర్కని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.