త్రికాల తెలుగు: ప్రతినిధి: కామరెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మత్తమల్ గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రముఖ శాస్త్రవేత్త, విగ్రహదాత, డాక్టట్ పైడి ఎల్లారెడ్డి..చత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

శివాజీని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని, శివాజీ ఆశయాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు పైడి ఎల్లారెడ్డి.

ఆదివారం, ఆగస్టు ౩౦, 2026న జరిగిన ఈ కార్యక్రమంలో..జిల్లా అద్యక్షులు నీలం చిన్నరాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గరిడె రవీందర్ రావు, స్థల ధాత పట్లోళ్ల రాంగోపాల్ రెడ్డి,ఆధ్యాత్మిక వక్త అనుసుజా రెడ్డి, ఉప సర్పంచ్ భారతమ్మ, మాజీ సొసైటీ చైర్మన్ జలంధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఊష గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నరసింహరాజు , నియోజకవర్గ మండల పార్టీ అద్యక్షులు, నాగిరెడ్డిపేట మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రాజదాస్, విశ్వహిందూ పరిషత్ వినోద్,తులసిదాస్,ముఖ్య నాయకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

చత్రపతి శివాజీ మహారాజు విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. చత్రపతి శివాజీ మహారాజుకు జై అనే నినాదాలతో మత్తమాల గ్రామం అంతా మారుమోగింది.

ఈ కార్యక్రమం సందర్భంగా ఎల్లారెడ్డి. మండల బిజెపి అధ్యక్షులు పెద్దెడ్ల నరసింహరాజును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పైడి ఎల్లారెడ్డి చేతుల మీదుగా శాలువా కప్పి చిరు సన్మానం చేయడం జరిగింది. డా.పైడి ఎల్లారెడ్డిజీ చేతుల మీదుగా చిరు సన్మానం పొందడం గౌరవంగా ఉందన్నారు పెద్దెడ్ల నరసింహరాజు.
1/5

2/5

3/5

4/5

ఈ మహోత్సవానికి సమస్త హిందూ బంధువులు, గ్రామీణులు , శివాజీ మహారాజు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీర శివాజీ మహారాజ్ ఆశీస్సులు పొందారు.