σ
కామారెడ్డి జిల్లా త్రికాల తెలుగు:
11 వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. లేదంటే తమ ఉద్యమాన్ని భవిష్యత్తులో మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే రాష్టంలో ఉన్న ప్రభుత్వ, పాఠశాలలు హాస్టళ్లలో మోలిక వసతులు కల్పించాలన్నారు నేతలు.
.ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల లో సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ శిశు మందిర్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు. రాష్ట్ర ఏబీవీపీ కార్యదర్శి మాచర్ల రాంబాబు ఆధ్వర్యంలో. సోమవారం జూలై 6 2026న ఈ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర , ,జిల్లా ఏబీవీపీ కమిటీ ముఖ్య నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఫీజురీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ..ఏబీవీపీ విద్యార్థి నేతలు. ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ వర్గాలకు చెందిన 20 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు స్కాలర్ షిప్స్ , ఫీజు రీఇంబర్స్మెంట్ పైనే ఆధారపడి చదువు కుంటున్నారన్నారు రాంబాబు. సర్కార్ నిర్లక్ష్యంతో లక్షలాది మంది విద్యార్థులు విద్యను ఆపేసి పరిస్థితి వస్తోందన్నారు. సరైన సమయానికి సర్టిఫికెట్లు అందాకా వేలాదిమంది విద్యార్థులు ఇతర స్టేట్లకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. స్కాలర్ షిప్స్ , ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం భిక్ష కాదు..విద్యార్థులు హక్కు అని నినదించారు ఏబీవీపీ విద్యార్థి నేతలు.
సర్కార్ ఇలాగే నిర్లక్ష్యం చేస్తే.. విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు విద్యార్ధి నేతలు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 14న ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళాశాల బంద్ ను విద్యార్థులు, తల్లిదండ్రులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.