- పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు-ఘన నివాళులు
- భారతీయ జనతా పార్టీ @ ప్రొద్దుటూరు నగరం-1
ఏపీ ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 25: త్రికాల తెలుగు : ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ( సెప్టెంబర్ 25, 2026 ) పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు.

జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీతో కలిసి పనిచేసి, జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా పార్టీని ముందుకు నడిపించడంలో పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కీలక పాత్ర పోషించారని నాయకులు పేర్కొన్నారు. ఆయన అందించిన ఏకాత్మ మానవతావాదం, అంత్యోదయ భావజాలం నేటికీ పార్టీకి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా డాక్టర్ వరుణ్ కుమార్ గారు హాజరై పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా ఆవుల సూర్యనారాయణ నియామకం
ఈ సందర్భంగా ఆవుల సూర్యనారాయణ గారిని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. పార్టీలో నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఎస్సీ మోర్చా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, ఆవుల సూర్యనారాయణకు ఈ బాధ్యత అప్పగించడం అందుకు నిదర్శనమని నాయకులు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా మరింత చురుకుగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అంకిరెడ్డిపల్లి చిరంజీవి రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకట్, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీశ్రీ, ఉపాధ్యక్షులు రెడ్డి ప్రసన్న, రవిప్రకాష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అఖిల, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు తుపాకుల చౌడయ్య, కార్యదర్శి మోహన్, హరికృష్ణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.