- అరెస్ట్‌కు కారణం చెప్పాల్సిందే: సుప్రీంకోర్టు
ఢిల్లీ , సెప్టెంబర్ 22: త్రికాల తెలుగు: అరెస్ట్‌కు కారణం చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. అరెస్టు చేసే సమయంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నిందితుడికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం, తన అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి వ్యక్తికీ ఉందని పేర్కొంది. ఈ నిబంధనలను పాటించకుండా చేసిన అరెస్టును చట్టవిరుద్ధమైనదిగా పరిగణించి, సంబంధిత వ్యక్తిని వెంటనే విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపింది.
అలాగే, నిబంధనలను ఉల్లంఘించే పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించింది.సే సమయంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నిందితుడికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.