పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్!

  • పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్!
  • దసరా పండక్కి ముందే.. అకౌంట్లోకి ఆ రోజే..

పీఎం కిసాన్ నిధుల విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చింది. దసరా పండుగ సందర్భంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.

అక్టోబర్‌లో 24వ విడత సాయాన్ని రిలీజ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రక్రియను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో లబ్దిదారులందరి అకౌంట్లలో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి. దసరా కానుకగా వీటిని విడదుల చేయాలని ప్రభుత్వం బావిస్తోంది. దీంతో పీఎం కిసాన్ సొమ్ము కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తొలుత వినాయక చవితి సందర్బంగా అందించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా రైతుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు పండక్కి ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ట్రెండింగ్ న్యూస్