త్రికాల తెలుగు హైదరాబాద్ : ముఖ్యమంత్రి చర్యలను చూస్తుంటే, తెలంగాణ గ్రామాల్లోకి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తోంది. బడ్జెట్ స్కూళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాటిని చంపేస్తున్నారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ భవనాలు ఎప్పటికీ కడతారో తెలియదు గానీ ఉన్న పాఠశాలలను మూసి వేసే కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల జోలికి వస్తే ప్రజలు ఈ ప్రభుత్వాన్నే పడగొడుతారు
-కల్వకుంట్ల కవిత, చీఫ్, తెలంగాణ రక్షణ సేన