‘మేడం బాగా నటించారు’: నవీన్ పొలిశెట్టి
హైదరాబాద్ త్రికాల తెలుగు: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో బుధవారం జులై 8, 2026న సాయంత్రం జరిగిన పోలీస్ గేమ్స్ మీట్‌లో హీరో నవీన్ పొలిశెట్టి సందడి చేశారు .తాను త్వరలో పోలీసు పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించిన ఆయన.. మల్కాజిగిరి సీపీ సుమతితో కలిసి నటించాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మహిళా భద్రతపై ఆమె చేసిన అండర్ కవర్ ఆపరేషన్ వీడియోను ప్రశంసిస్తూ.. తమ చిత్రంలో ఒక రోల్ చేయాలని కోరారు.