దేశంలో అల్లర్లకు విదేశీ కుట్ర !

  • దేశంలో అల్లర్లకు విదేశీ కుట్ర..!
  • విదేశాల నుండి డబ్బులు, ఆందోళనలకు భోజనాలు సరఫరా
  • కాక్రోచ్ జనతా పార్టీ వెనక నక్సలైట్లు, అసాంఘిక శక్తులు
  • టిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1, ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజీలు
  • 27 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు?
  • రాహుల్ పార్లమెంటులో మాట్లాడకుండా మోడీ ఇంటి ముందు ఎందుకు ఆందోళన?
  • రేవంత్ రెడ్డి – కేటీఆర్ ల డ్రామా
  • ఢిల్లీలో ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామా..
  • షాద్ నగర్ లో రంగారెడ్డి జిల్లా కార్యకర్తల సమావేశం
  • జిల్లా నలుమూలల నుండి హాజరైన బిజెపి ప్రముఖులు
  • -రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

త్రికాల తెలుగు: రంగారెడ్డి జిల్లా: భారతదేశంలో అల్లర్ల కోసం విదేశీ కుట్రలు కొనసాగుతున్నాయని వీటిని చూస్తూ ఊరుకోమని దేశభక్తులుగా యువత తిప్పికొట్టేందుకు ఉద్యమించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఏబి కాంప్లెక్స్ లో జిల్లా అధ్యక్షలు రాంభూపాల్ గౌడ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అదేవిధంగా జిల్లా ఇంచార్జ్ రఘునాథ్ మాజీ జిల్లా అదక్షలు బొక్క నర్సింహరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కేఎస్ రత్నం, మాజీ ఎంపీ బూర నర్సింహ గౌడ్, తోకల శ్రీనివాస రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్ కొప్పు భాషా, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, అర్జున్ రెడ్డి, శ్రీధర్, దేపల్లి అశోక్ గౌడ్, నర్సింహ గౌడ్, వెంకటేష్ గుప్తా, మల్లారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమావేశ ఉద్దేశించి రామచంద్రరావు మాట్లాడుతూ.. దేశంలో విధ్వంసం అల్లర్లు చేయడానికి విదేశీ కుట్టడం జరుగుతున్నాయని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక పేపర్ లీకేజీలు జరిగాయని, అప్పుడు ఎవరైనా రాజీనామా చేశారా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అంశంతో కావాలనే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రాహుల్ గాంధీ చూస్తున్నారన్నారు. జంతర్ మంతర్ నిరసనకు హైదరాబాద్ నుంచి బిర్యానీ పోతే ఇబ్బందేంలేదని,
కానీ విదేశాల నుంచి కూడా భోజనాలు వస్తున్నాయని అందులో ఏముస్తుందో అందరికీ తెలుసన్నారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడకుండా మోడీ ఇంటి ముందు చేతకాక ఆందోళన చేస్తున్నారని విమర్శించారు.

  • వెనుక ఎవరున్నారో తెలుసు..

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం పక్కదారి పట్టడమేంటని, అసలు దానికి దారే లేదని ఎద్దేవాచేశారు. ఉద్యమాన్ని ఎవరు పక్కదారి పట్టిస్తున్నారనేది కెమెరాలు చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కక్రోచ్ జనతా పార్టీ పేరిట చలో పార్లమెంట్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, సుప్రీంకోర్టు సీజేఐ చేసిన కామెంట్స్ నచ్చక సీజేఐని అవమానపరచడానికి ఒక వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాడని రాంచందర్ రావు గుర్తుచేశారు. కాక్రోచ్ పార్టీలో సినిమా వాళ్లు,ఆటగాళ్లు, నక్సలైట్లు కలవడమంటే, దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడమే కొందరు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. హైదరాబాద్ లో జరిగిన కాక్రోచ్ పార్టీ సమావేశానికి కూడా నక్సలైట్ హాజరయ్యారని ఆయన ప్రధానంగా ఆరోపించారు.

  • రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒక్కటే..

సీఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు ఒకటేనని వీరిద్దరూ కలిసి రాష్ట్రంలో రాజకీయ గ్రామాలు వాడుతున్నారని రామచంద్రారావు విమర్శలు వ్యక్తం చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రూప్ 1, ఇంటర్ పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని దాదాపు 27 మంది ఆత్మహత్యలు రాష్ట్రంలో చేసుకున్నారని దీనిపై కేటీఆర్ ఎందుకు సంజాయిషీ ఇవ్వలేదని రాజీనామాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటి ఎంఐఎంకు మద్దతు చేశారని గుర్తు చేశారు. దేశంలో ఏదైనా జరిగితే రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఒక్కటే ఆందోళనలకు దిగుతారని అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని ఉదాహరణకు రైతు చట్టాల వ్యవహారం అని గుర్తు చేశారు. ప్రధాని మోడీని బద్నాం చేసేందుకు వీరిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. యువత విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఆటలాడుకుంటుందని ఆరోపించారు. కాక్రోచ్ జనతా పార్టీ కాంగ్రెస్ ఒకటి దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

  • దమ్ముంటే విద్యార్థులను ఆదుకో..

ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం ఫీజుల బకాయి.. బిజెపి లడాయి పోస్టర్ ను రంగారెడ్డి జిల్లా కార్యకర్తల సమావేశం సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలలో ఖాళీల భర్తీ మాట ఏమిటని అదేవిధంగా 1000 కోట్లు కేటాయిస్తున్న సీఎం ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఉద్యమాలు ఉవ్వెత్తున చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

  • జిల్లాలో బిజెపికే అన్ని సీట్లు..

తమకున్న సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో బిజెపి క్లీన్ స్విఫ్ట్ చేయబోతుందని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు ప్రకటించారు. బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున భవిష్యత్తు ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశాలు సభలు నిర్వహించుకుంటే ఏమి రాదని ఉద్యమాల ద్వారా రోడ్డుపైకి రావాలని రామచంద్రారావు బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు బిజెపి వ్యవసం చేసుకోబోతుందని అన్నారు. తెలంగాణ వచ్చాక రెండుసార్లు టిఆర్ఎస్ కు మరోసారి కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇచ్చారని వీరి పాలనతో ప్రజలు విసిగిపోయారని అందరి గుండెల్లో బిజెపి ఇప్పుడు ఉందని అందుకే ప్రజల సమస్యలపై కార్యకర్తలు లడాయికి సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కక్కునురి వెంకటేష్ గుప్తా, వంశీకృష్ణ, మురళి, మహిళా కార్యకర్తలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్