“వీడియో జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలి”


“వీడియో జర్నలిస్టులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలి” అని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె.కేశవరావుకి వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నండూరి హరీష్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

త్రికాల తెలుగు: హైదరాబాద్: తమను ఎందుకు తెలంగాణ ఉద్యమ కారులుగా గుర్తించాలో ఈ వినతి పత్రంలో తెలంగాణ రాష్ట్ర వీడియో జర్నలిస్టు అసోసియేషన్ వివరించింది. “మేము తెలంగాణ వీడియో జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులం. ముందుగా తెలంగాణ బిడ్డలం. తెలంగాణ వాదాన్ని అస్తిత్వాన్ని లాఠీ చార్జ్, రాళ్ల దెబ్బలు, టియర్ గ్యాస్ లను సమర్థంగా ఎదుర్కొనీ ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లీ వరకు ఊర్ల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు పల్లెటూర్లలో జరిగిన పట్టణములో జరిగిన ముందుండి మా కెమెరాతో ప్రపంచానికి తెలియజేసిన బిడ్డలం. అందరికీ తెలంగాణ పోరాటాన్ని ముందుండి ప్రపంచానికి తెలియజేసిన మేము ఈరోజు వెనుకబడి ఉన్నాము.

మేము ఏ సంస్థలో పనిచేసినా తెలంగాణ వాదాన్ని ఎక్కడా విడిచిపెట్టలేదు. మా కెమెరాలు పక్కనపెట్టి ఉస్మానియాలో కానీ ఎక్కడ ఉద్యమం జరిగినా వారితో పోరాటం చేసినం. ఆడినం పాడినం కానీ ఈరోజు మామ్మల్ని ఉద్యమకారులుగా గుర్తించాలి అంటే మీ దగ్గర ఏముంది అని అడిగిన పెద్దల ముందు అచేతనంగా నిలబడినం. ఈరోజు మేము ఉద్యమకారులం.. తెలంగాణ రావడానికి మేమే కృషి చేసినం అని వందలాదిమంది మీ దగ్గరికి వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారంటే వారు చేసిన ఉద్యమాన్ని మేమే కదా సమాజానికి తెలియజేసింది. అది మా చేతిలో ఉన్న కెమెరా తో వారిని మేము బంధించినం. మేము తీసిన వీడియోలని ప్రూఫ్ గా చూపెట్టి ఈరోజు వారు మీ ముందు నిల్చున్నారు.

అంత కష్టపడి తీసిన మేము ఎటూ కాకుండా వెనక నిలబడి ఉన్నాము. ఉద్యమానికి ఊపిరి పోసి సమాజానికి తెలియజేసిన మా వీడియో జర్నలిస్టులను ఎట్టి పరిస్థితులలోనూ విడిచి పెట్టవద్దని ఉద్యమకారుల జాబితాలో మా పేర్లు కూడా చేర్చాలని మా అసోసియేషన్ తరపున విన్నవించుకుంటున్నాము. మా పేర్ల మీద కేసులు..పేపర్ క్లిప్పింగ్స్.. వీడియోస్ కానీ ఏమీ ఉండవూ దయచేసి ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని మలిదశ ఉద్యమంలో తెలంగాణ రావడానికి ఎంతగానో కృషి చేసిన మా వీడియో జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలి” అని అసోసియేషన్ ప్రెసిడెంట్ నండూరి హరీష్,.. జనరల్ సెక్రటరీ సన్నీ, ట్రెజరర్ విజయ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ జనార్దన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ లు వీడియో జర్నలిస్ట్ లా అభ్యంతరాలను పెద్దలకి సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మరియు సీనియర్ వీడియో సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్