
త్రికాల తెలుగు : హైదరాబాద్ :
- ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై రాష్ట్ర గవర్నర్ కు టీచర్ MLC మల్క కొమరయ్య వినతులు.
లోక భవన్ లో శనివారం జూలై 25 2026న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసిన టీచర్ MLC కొమరయ్య - ఉపాధ్యాయులు., విద్యారంగ సమస్యలతో పాటు, *E-kubera*పెండింగ్ బిల్స్ క్లియరెన్స్ కు సంబంధించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లకి వినతి పత్రం అందజేసిన MLC మల్క కొమరయ్య
- ఈ సమస్యలు గత కొన్నేళ్లుగా పరిష్కారం కాకపోవడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన MLC కొమరయ్య
- ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించేలా జోక్యం చేసుకోవాలని MLC విజ్ఞప్తి.

గవర్నర్‌కు సమర్పించిన ప్రధాన ప్రతిపాదనలివే.
*ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ (PRC) ప్రకటించి 51 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి.
*E-Kubera ద్వారా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలి.
*పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలి.
*ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం లేకుండా చెల్లించాలి.
*హెల్త్ ట్రస్ట్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు ఉపాధ్యాయుల వేతనాల నుంచి కోతలు నిలిపివేయాలి.
*ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు వార్షిక క్యాలెండర్ ప్రకటించి పారదర్శకంగా అమలు చేయాలి.
*స్పెషల్ టెట్‌లో అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించి, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు దరఖాస్తు అవకాశం కల్పించాలి.
*రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాసంస్థల్లో ఏకరీతి పనివేళలు, టైమ్‌టేబుల్ అమలు చేయాలి.
*కేజీబీవీ, సమగ్ర శిక్ష సిబ్బందికి సమ్మె కాలపు వేతనాలు విడుదల చేసి, కనీస వేతనాలు అందేలా చూడాలి.
*మోడల్ స్కూల్–010 సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి.
*జి.ఓ. ఎంఎస్. నెం.190ను విద్యాశాఖలో పూర్తిస్థాయిలో అమలు చేసి అర్హులైన ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలి.
*డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేసి, సుప్రీంకోర్టులో ఉన్న – ఎస్‌ఎల్‌పీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
*సీపీఎస్ (CPS) స్థానంలో అర్హులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలి.
*గురుకుల, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల సేవా, ఆర్థిక, పరిపాలనా సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి.

సానుకూల స్పందన
ఈ వినతులపై రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కార దిశగా చర్యలు తీసుకునేలా చూస్తామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.