HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
దేశంలో పరీక్ష పేపర్ల లీక్స్ కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పోటీ పరీక్షల పేపర్లు లీక్ కాకుండా నందన్ నీలేకని నేతృత్వం లో హై పవర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. ఆ టాస్క్ ఫోర్స్ కేవలం పరీక్షల నిర్వహణపైనే ఫోకస్ పెడుతుంది. దేశంలో రాబోయే పోటీ పరికల్లో అక్రమాలకు చోటు లేకుండా హైపవర్ టాస్క్ ఫోర్స్ అన్ని జాగ్రత్తలు తీకుంటుందని మోడీ అయన ఖాతాలో విడుదల చేసిన మూడో వీడియోలో తెలిపారు. ఇక నుంచి ఎవరైనా పరీక్షా పేపర్ల లీక్స్ కు పాల్పడితే జైలు ఖాయమన్నారు. ఇప్పటికే కొందరు జైళ్లలో ఊచలు లెక్కపెడుతున్నారని గుర్తుచేసారు ప్రధానమంత్రి మోడీ.
ఈ నందన్ నిలేకని ఎవరో తెలుసా ?

నందన్ నీలేకని (Nandan Nilekani) భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సాంకేతిక నిపుణుడు. ఆయన ముఖ్యంగా ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుల్లో (Co-founder) ఒకరిగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు.
- IIT బాంబేలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
- ఇన్ఫోసిస్: 1981లో ఎన్.ఆర్. నారాయణ మూర్తి తదితరులతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు.
- ఆధార్ ప్రాజెక్ట్: 2009–2014 మధ్య భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన UIDAI తొలి ఛైర్మన్‌గా పనిచేసి, ఆధార్ (Aadhaar) వ్యవస్థ అమలులో కీలక పాత్ర పోషించారు.
- పురస్కారం: 2006లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది.
- కేంద్ర ప్రభుత్వం పరీక్షల సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు నందన్ నీలేకనిని ఛైర్మన్‌గా నియమించింది.