ప్రభుత్వ విద్యను మెరుగుపర్చాలి-CPM

గోప్లాపూర్ అన్నారం కొత్తపేట గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా మౌలిక వసతులు మధ్యాహ్నం భోజనం షెడ్లు తదితర అంశాలపై CPM సర్వే.

  • ప్రభుత్వ విద్యా మెరుగుపర్చాలి
  • ప్రైవేట్ విద్యా సంస్థలో రిజర్వేషన్స్ కల్పించాలి


త్రికాల తెలుగు: వనపర్తి జిల్లా ప్రతినిధి: గోప్లాపూర్ అన్నారం కొత్తపేట గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా మౌలిక వసతులు మధ్యాహ్నం భోజనం షెడ్లు తదితర అంశాలపై CPM నాయకులు సర్వే చేయడం జరిగింది. CPM పార్టీ నాయకులు గుంటి వెంకటయ్య భగత్ భాస్కర్ మాట్లాడుతూ..”గోప్లాపూర్ కొత్తపేట పాఠశాలలో స్కావెంజర్స్ లేక పరిశుభ్రత లోపించింది. విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని కానీ ఉపాధ్యాయుల కొరత ఉంది. పెరిగిన ధరలకనుగునంగా మెను పెంచి నాణ్యమైన భోజనం అందించాలి. వంట చేసే కార్మికులకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే చెల్లించాలి. కొత్తపేట పాఠశాలలో స్కూలు కాంపౌండ్ నిర్మించాలి. జిల్లా కలెక్టర్ మరియు మంత్రిగారు జోక్యం చేసుకొని వెంటనే నాణ్యమైన విద్య మధ్యాహ్న భోజనం మౌలిక వసతులపై నిర్ణయం తీసుకొని పరిష్కరించాలి. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం.”అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రేమద్దుల గ్రామ ఉపసర్పంచ్ చింతకుంట మహేష్ రాము తదితరులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ న్యూస్