పార్లమెంట్ లో పరీక్ష పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. పరీక్ష పేపర్లు లీక్ చేసే అక్రమార్కులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పార్లమెంట్ లో పరీక్ష పేపర్ లీక్ నిరోధక బిల్లు జూలై 30, 2026న ఆమోదం పొందిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. పరీక్ష పేపర్లు లీక్ చేసే అక్రమార్కులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. pic.twitter.com/BMdJ3H5GGR
— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) July 30, 2026
వీడియోలో మోడీజీ మాట్లాడుతూ… “పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. మన పరీక్షల వ్యవస్థను మరింత పటిష్ఠంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతిభ, నిజాయితీతో చదివే యువతకు న్యాయం జరిగేలా ఈ చట్టం దోహదపడుతుంది.”అని వీడియోలో చెప్పారు.